‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ఎమోషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గొడవలు, గిల్లిగజ్జాల మధ్య వారి వారి తొలి ప్రేమను గుర్తుచేసి ఆ జ్ఞాపకాలకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంట్లోని సభ్యులకు వారి తొలిప్రేమ మధుర స్మృతులను గుర్తు చేశాడు. అందరూ వారివారి ప్రేమకథా చిత్రాలను ఓసారి నెమరు వేసుకున్నారు. వారి వాళ్లకు దూరంగా ఉన్నా కూడా వారి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపేస్తున్నారు. కొన్నిసార్లు కన్నీరుపెట్టుకుంటున్నా.. విజేతగా వెళ్లాలనే నిశ్చయంతో ఆడుతున్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి సీజన్ ప్రేక్షకుల నుంచి చాలా మంది ఆదరణ లభిస్తోంది.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే నటరాజ్ మాస్టర్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. నటరాజ్ మాస్టర్ హౌస్‌లోకి ఎటర్ అయ్యేటప్పుడు ఆయన భార్య ప్రెగ్నెంట్ అని తెలుసుకదా. ఆమెకు ఇటీవల సీమంతం జరిగింది. హౌస్‌లో ఉండటం వల్ల మాస్టర్‌కు ఆ విషయం తెలీదు.. ఎలా జరిగిందో తెలీదు. అందుకని మాస్టర్ కోసం సీమంతం ఎలా జరిగిందో వీడియోని చూపించారు. ముందు చిన్నపిల్లల ఏడుపును ప్లే చేశారు. అందరూ ఎక్కడా అని పరుగులు పెట్టగా.. టీవీలో వీడియో స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా భార్యను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ మాస్టర్ అలాగే ఉండిపోయాడు. పరుగులు పెడుతూ స్క్రీన్ ముద్దాడుతూ ఆమెను ఎంతలా మిస్ అవుతున్నాడో చూపించాడు నటరాజ్ మాస్టర్. మాస్టర్ లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన సందర్భంలో ఆయన అక్కడ లేకపోయినా.. ఆ సంఘటనను చూపించి నటరాజ్ మాస్టర్‌కు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.