పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఓటిటీ మొదటి సీజన్ చివరిదశకు చేరుకుంది. అయితే.. బిగ్ బాస్ గత 5 సీజన్లకు లభించిన ఆదరణ ఈ ఒటిటి సీజన్ కి లభించలేదు. టీవీ షో క్లిక్ అయినట్లుగా ఓటిటి బిగ్ బాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయినప్పటికీ.. నిర్వాహకులు ఉన్నవాళ్లతోనే బిగ్ బాస్ షోని చివరివరకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే.. హౌస్ లో ఈసారి 11 వారాలపాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ ఇటీవలే ఎలిమినేట్ అయి బయటికి వచ్చారు.
ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్.. హౌస్ లో ఉన్న సభ్యుల గురించి కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్ బిందు మాధవిపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె పాయింట్ లేకపోయినా ఏదొక పాయింట్ రైస్ చేసి ఎదుటివారిని రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తుందని చెప్పిన మాస్టర్.. హౌస్ లో ఉన్నవాళ్లు పెయిడ్ సోషల్ మీడియా సపోర్ట్ తోనే ముందుకు వెళ్తున్నారని, వాళ్లెవరో తనకు తెలుసనీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నటరాజ్ మాస్టర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.