ప్రస్తుతం ఏ వీడియో నెట్టింట్ల ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ఫన్నీ వీడియోలు, కొన్నిసార్లు ఎమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సర్‌ప్రైజ్ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. డిసెంబర్ లో దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా మిలియన్ వ్యూస్ వచ్చాయి.
వివరాల్లోకి వెళితే.. శ్రద్ధా షెల్లార్ ఇటీవల యుకెకు వెళ్లింది. అయితే భారత్ లో ఉన్న సోదరుడికి వివాహం నిశ్చయమైంది. అయితే ఆ పెళ్లికి హాజరు కాలేమోనని ఆవేదన చెందింది. ఎట్లా అయినా తన సోదరుడికి వివాహానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.అనుకున్నదే తడువుగా భారత్ కు బయలు దేరింది. పెళ్లికి వెళ్లి అందర్ని ఆశ్చర్యపరిచింది. అయితే తమ కుమార్తె ఈ వివాహానికి రాదని భావించిన తల్లిదండ్రులు, సోదరుడు ఆమె రాకతో ఒక్కసారిగా సంభ్రమాశ్చార్యంలో మునిగి తేలారు. ఈ వీడియో శ్రద్ధా షెల్లార్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా మూడు లక్షల మంది వీక్షించారు. 42 వేల లైకులు వచ్చాయి.
కాగా, ఈ వీడియోను తిలకించిన కొంత మంది నెటిజన్లు భావోద్వేగానికి గురికాగా, మరికొంత మంది ఫన్నీ కామెంట్లు కూడా పెట్టారు. పెళ్లికూతురిపై బంధువులకు ఉండాల్సిన దృష్టిని మీరు మీ వైపుకు తిప్పుకున్నారని కొందరు కామెంట్స్ చేశారు. ఈ వీడియో కుటుంబ సభ్యుల మధ్య కనిపించిన అనుబంధం కంటతడి పెట్టిందని మరొక యూజర్, పెళ్లి కూతురిని చూస్తే బాధంగా ఉందని, అందరి దృష్టి ఆమెపై ఉండాలి , సోదరీ-సోదరుల ప్రేమను అర్థం చేసుకోగలము కానీ, సందర్భాను సారం నడుచుకోవాలి అంటూ కొందరు సోషల్ సైనికులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియోను మీరు చూసి.. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.