ప్రియాంక సింగ్‌ పై సోషల్‌ మీడియా వేదికగా మానస్‌ ఫ్యాన్స్‌ ఫైర్..

maanas priyanka

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ఆట ఉత్కంఠగా సాగుతోంది. 19 మందితో మొదలైన జర్నీ ఇప్పుడు 9 మందికి చేరుకుంది. ఒక్కొక్కరు తగ్గుతున్న కొద్దీ హౌస్‌లో గొడవలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ కు సంబంధించిన ఒక విషయం మాత్రం ట్విట్టర్‌ లో ట్రెండ్ అవుతోంది. మానస్‌- ప్రియాంక సింగ్‌ కు సంబంధించింది ఆ విషయం. #Priyanakastopusingmaanas అనే హ్యాష్‌ ట్యాగ్‌ బాగా వైరల్‌ అవుతోంది. మానస్‌ సపోర్టర్స్‌, అభిమానులు అందరూ ఈ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్లు చేస్తున్నారు. ప్రియాంక హౌస్‌లో కొనసాగేందుకు మానస్‌ను ఉపయోగించుకుంటోందనేది వారి వాదన. ప్రియాంక సింగ్‌ వల్లే మానస్‌ గ్రాఫ్‌ కూడా పడిపోతోందని వారు చెప్తున్నారు.

అసలు గొడవ..

గతవారం కెప్టెన్సీ టాస్కుతో అసలు గొడవ మైదలైంది. సిరి, కాజల్‌, రవి, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నారు. నలుగురు టవర్లు నిర్మించి వాటిని కాపాడుకోవాలి. సన్నీకి మానస్‌, ప్రియాంక సింగ్‌ సపోర్ట్‌ చేశారు. అయితే ప్రియాంక వళ్లే రెండుసార్లు సన్నీ టవర్‌ కూలిపోతుంది. ప్రత్యర్థులు చేసిన దాడి కంటే కూడా పింకీ చేసిన పనికే సన్నీ ఓడిపోయాడు. ఆ విషయాన్ని అందరూ చూశారు. అయితే అసలు కథ అక్కడే మొదలైంది.

కావాలనే ఇదంతా..

అదంతా ప్రియాంక సింగ్‌ కావాలనే చేసింది అని ఆరోపిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. మానస్‌.. సన్నీతో మాట్లాడుతూ ప్రియాంక కావాలనే అలా చేసిందేమో? అనే అనుమానాన్ని వ్యక్త పరిచాడు. అక్కడితో అభిమానులు బాగా సీరియస్‌ గా తీసుకున్నారు. ప్రియాంక సింగ్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతోందంటూ ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేశారు. ప్రియాంక రవికి సపోర్ట్‌ చేస్తోంది అంటూ పాత వీడియోలను వెలికి తీస్తున్నారు.

మానస్‌ కు ఆ వీడియో చూపించండి..

ఇప్పుడు మానస్‌ ఫ్యాన్స్‌ ఒక డిమాండ్‌ చేస్తున్నారు. టవర్‌ గేమ్‌ సమయంలో ప్రియాంక సింగ్‌ కావాలనే అలా చేసింది. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియోని మానస్‌ కు చూపించాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే మానస్‌ కు మొత్తం అర్థమవుతుంది. తప్పకుండా ఇక నుంచి అయినా జాగ్రత్త పడతాడు అంటూ కోరుతున్నారు. ప్రియాంక సింగ్‌ నిజంగానే డబుల్‌ గేమ్‌ ఆడుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.