సిరితో స్నేహమే షణ్ముఖ్ కి శాపం కాబోతుందా?

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి రెండు వారాలను పూర్తిచేసుకుని మంచి రేటింగ్ ను సంపాదించుకుంటోంది. కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడుతున్నారని.. కాకపోతే తొందరపడి మాటలు జారుతున్నారని అన్నారు. ఈ విషయంలో కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకోవాలన్నట్లుగా హెచ్చరించారు. అయితే ఈ వారంలో జరిగిన ఫిజికల్ టాస్క్ లో సన్నీ పై ఒక నింద వేయడం జరిగింది. అతను తన టీ షర్ట్ లో చేయి పెట్టాడు అని కూడా అందరు తప్పుగా అనుకునేలా సిరి చెప్పడం కొత్త నెగిటివ్ కామెంట్ ను కూడా అందించింది.

sham minఈ క్రమంలో సిరికి మద్దతుగా షణ్ముఖ్ జస్వంత్ కూడా నిలిచాడు. చివరికి నాగార్జున వీడియోలు చూపించి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దాంతో సన్నీ విషయంలో చేసిన తప్పు సిరీ, షణ్ముఖ్ ఇద్దరు తల దించుకున్నారు. సారీ చెప్పడమే కాదు ఇకపై క్యారెక్టర్ ని ఎత్తి చూపే విషయం చేయబోమని అన్నారు. అంతే కాదు నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనను తానే దెయ్యంగా ట్రీట్ చేస్తు స్టిక్కర్ అంటించుకున్నాడు. కానీ నాగార్జున అది ఇంట్లో ఎవరో దెయ్యం వారికే అంటించాలని చెప్పడంతో సిరికి తనకు దెయ్యం అంటూ స్టిక్కర్ అంటించారు. మొదటి వారం ఎలా ఉన్నా ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బిగ్ బాస్ లో ఎంట్రీ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ కి విపరీమైన క్రేజ్ ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ట్విట్టర్ లో సైతం షణ్ముఖ్ జస్వంత్ ఓ హీరో రేంజ్ లో లైక్స్ సంపాదించాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో సిరికి మద్దతు ఇవ్వడం.. ఆమెతో ఎక్కువగా గడపడం తో షణ్ముఖ్ పై విమర్శలు వస్తున్నాయి.

shagwe minఅంతే కాదు బిగ్ బాస్ లో టాస్క్ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ సన్నీకి మధ్య గొడవలు అయితే జరిగాయి. ఫిజికల్ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. అప్పుడు సన్నీ పై షణ్ముఖ్ చాలా సీరియస్ అయ్యాడు. ఇక సిరి కోసం మరోసారి సన్నీని బుక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నాగార్జున.. సిరి గుట్టు విప్పడంతో అందరి ముందు తలదించుకునే పరిస్థితి షణ్ముఖ్ కి ఏర్పడింది. అయితే బిగ్ బాస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ అయిన సరయు సైతం సిరీ, షణ్ముఖ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ యూట్యూబర్స్ ముందుగానే పదురుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారని.. ఆ ప్రకారమే బిగ్ బాస్ ఇంట్లో కూడ నడుచుకుంటున్నారని సరయు కామెంట్స్ చేసింది. ష‌ణ్ణు.. సిరి చెప్పినట్టు వింటున్నాడ‌ని.. వేలిపై సిరి ష‌ణ్ముక్ ను సిరి ఆడిస్తోందని స‌ర‌యు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆట ఆడ‌టం లేద‌ని మూల‌కు వెళ్లి కూర్చుంటున్నాడ‌ని ఆరోపించింది. అంతే కాదు ఓ ఇంటర్వ్యూలో షణ్ముక్ ఫోటో ఫ్రేమ్ ని బ్రేక్ చేసి కింద పడేసింది.

shannu min 2ఇలా సరయు చేసిన కామెంట్స్ అలా ఉంటే.. నిన్న బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన ఉమాదేవి.. ఓ ఇంటర్వ్యూలో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ ఆడే ఆట కూడా సిరి ఆడుతోంది అంటూ చెప్పుకొచ్చింది. సిరీ, షణ్ణు ఫ్రెండ్స్ అయితే వాళ్లు ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు.. కానీ బిగ్ బాస్ ఫ్లాట్ పామ్ కి వచ్చి ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని అన్నారు. మంచాలు కూడా పక్క పక్కనే వేసుకుంటారా? అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు ఉమాదేవి. సిరి మాటలు వింటూ అలాగే చేస్తే త్వరగా ఇంటి బయటకు రావడం ఖాయం అన్నారు ఉమాదేవి.  ఏది ఏమైనా బిగ్ బాస్ హౌజ్ లో సిరిపై విమర్శలు వస్తున్న తరుణంలో షణ్ముఖ్ కూడా దానికి బలి అవుతున్నాడా..? తన గేమ్ తాను ఆడకుండా సిరి వెనుక పడటంతో తన ఇమేజ్ కోల్పోతున్నాడా అన్నది తానే అర్థం చేసుకోవలని అంటున్నారు. ఇక షన్ముఖ్ తన గేమ్ పర్ఫెక్ట్ గా ఆడి బిగ్ బాస్ హౌజ్ లో తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటే అంత సపోర్ట్ వస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.