బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎమోషనల్ చేసేస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లోకి ఆదిరెడ్డి, ఫైమా, రాజ్, శ్రీసత్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు హౌస్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. ఆమె బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్ కూడా. అవును.. శ్రీహాన్ ప్రేయసి సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. సాధారణంగా ఫ్యామిలీ ఎపిసోడ్లో వీళ్ల పార్ట్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇన్నిరోజుల తర్వాత కలిస్తే వీళ్లు ఎలా మాట్లాడుకుంటారు? ఎలా ఉంటారు? సిరిని చూసి శ్రీహాన్ ఎలా రియాక్ట్ అవుతాడు అంటూ చాలా ఎదురుచూశారు. శ్రీహాన్ ఫ్రీజ్‌లో ఉండగా సిరి వస్తుంది. రాగానే శ్రీహాన్‌ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది.
రిలీజ్ చేసిన తర్వాత హస్‌మేట్స్ అందరూ వచ్చి సిరితో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరి గురించి సిరి చెబుతూ ఉంటుంది. వాళ్లు గతంలో చెప్పిన మాటలకు శ్రీహాన్ తరఫున సిరి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. సిరి నిన్ను చాలాసార్లు చింకీ ఫేస్ అంటూ ఉండేవాడు అని రేవంత్ చెప్పుకొచ్చాడు. అందుకు శ్రీహాన్ తర్వాత క్యూట్‌గా కూడా ఉంటుందని చెప్పాగా అది చెప్పవేంటి? అంటూ ప్రశ్నించగా.. నాకు చెప్పలేదు శ్రీసత్యకు చెప్పావు అంటూ సిరి కౌంటర్ ఇస్తుంది. సిరి- ఇనయాకి కూడా కౌంటర్ వేస్తుంది. ఏంటి ఈ మధ్య మావాడిపై కాన్సన్ట్రేట్ చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తుంది. శ్రీహాన్‌ని ఏడిపిస్తూ ఉంటాం.. ఏమనుకోకు అంటూ శ్రీసత్య చెప్పుకొస్తుంది. ఏడించకండి.. నేను అనుకుంటా అంటూ సిరి మళ్లీ కౌంటర్ వేస్తుంది.
అయితే శ్రీహాన్‌కి ఓ బిగ్ సర్ప్రైజ్తో సిరి హన్మంత్ ఇంట్లో అడుగుపెట్టింది. అదేంటంటే.. సిరి హన్మంత్ తన ప్రియుడు శ్రీహాన్ పేరుని వెనుక మెడ మీద టాటూ వేయించుకుంది. లోపలికి వచ్చిన తర్వాత కళ్లు మూసుకో అని చెప్పి అతనికి ఆ టాటూ చూపిస్తుంది. అది చూసిన తర్వాత శ్రీహాన్ నోట మాట రాలేదు. ఆమె హగ్ చేసుకుని అలా ఉండిపోయాడు. తర్వాత వాళ్ల అబ్బాయి కూడా హౌస్‌లోకి వచ్చాడు. డాడీ అనగానే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లాడు. అతనితో హౌస్ మొత్తం ఆడుకుంది. హౌస్‌లో ఎవరు ఎలా ఉంటారు? ఎవరు ఎలా మాట్లాడుతారు అనేవి మనోడు బాగా నేర్చుకున్నాడు. ఒక్కొక్కరి గురించి ఒక మాట చెబుతూ వారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.