నువ్ మాట్లాడితే మజాక్.. నేను మాట్లాడితే రజాక్.. సిరిపై యానీ మాస్టర్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్ మొదలై ఓ నెల కావొస్తుంది. 29 వ రోజు బిగ్ బాస్ ఇంట్లో కిచెన్ లో మొదలైన లొల్లి మాటల యుద్దానికి దారి తీసింది. ఇప్పటికే ఇంటి నుంచి సరయు,ఉమాదేవి,లహరి తో పాటు ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈసారి బహిరంగంగా కాకుండా హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల పేర్లు చెప్పమని అడిగారు బిగ్ బాస్. తర్వాత షణ్ముఖ్ ని పిలిచిన బిగ్ బాస్.. తనను ఎవరైతే నామినేట్ చేశారో వారందరినీ టీవీలో చూపించారు.

gaegge min 1ఇదిలా ఉంటే.. కిచెన్ రూమ్ లో జెస్సీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతా ఓకేనా నీకు’ అని ప్రశ్నించాడు శ్రీరామ్. దీంతో జెస్సీ సీరియస్ అవుతూ.. ‘ఫుడ్ ఇవ్వను.. ఫుడ్ పెట్టను అని ఎలా చెప్తారు..?’ అని ఫైర్ అవుతుండగా.. షణ్ముఖ్ ఇన్వాల్వ్ అవుతూ.. ‘ఇది మీ ఇల్లు కాదు.. బిగ్ బాస్ హౌస్ ఇది’ అని శ్రీరామ్ పై విరుచుకుపడ్డాడు. ఈ విషయంలోనే షణ్ముఖ్, సిరితో శ్రీరామ్ కి గొడవ అయ్యింది. తర్వాత సిరి,షణ్ముఖ్,జెస్సీ గార్డెన్ ఏరియాకు వచ్చి మంతనాలు జరుపుకున్నారు. అంతలోనే శ్రీరామ్ ‘నువ్ విన్నావా అసలు నేనేం అన్నానో’ అని అనగా.. ‘తను నా ఫ్రెండ్.. నేను స్టాండ్ తీసుకుంటా’ అని బదులిచ్చాడు షణ్ముఖ్. ఇక్కడ అందరూ అందరికీ ఫ్రెండ్సే అని శ్రీరామ్ అనగా.. ‘బట్ నా రూల్ బుక్ లో విన్నరే మాట్లాడాలని లేదు’ అని షణ్ముఖ్ యాటిట్యూడ్ తో అన్నాడు.

sriram minఈ రూల్స్.. 26 ఏళ్లకు ఏం అవసరం లేదని అనుకోకు.. నేను ఇంతే నా రూల్స్ ఇంతే అని అనకు..’ అంటూ శ్రీరామ్ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత సిరి లేచి ‘పార్టిసిపేషన్ లేదని ఎందుకు అంటున్నావ్ అని’ శ్రీరామ్ పై ఆవేశంతో మండిపడింది. ఆ సమయంలో యానీ మాస్టర్ వచ్చి సిరి అక్కడకు వచ్చి కిచెన్ లో అంతా పని చేను చేస్తున్నా.. అని చెప్పడం సరి కాదు సిరీ అన్నారు. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే.. ‘నువ్ మాట్లాడితే మజాక్.. నేను మాట్లాడితే రజాక్..’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో సిరి సైలెంట్ గా ఉండిపోయింది.