తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమెపై సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సిరిసిల్లలో కొత్తగా నిర్మించిన ఓ హోటల్ ప్రచారపాటలో సరయు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై అభియోగం. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు.. ఆపై ఈ కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ప్రకటనలో సరయు, ఆమె స్నేహితులు మద్యం సేవించి, గణపతి బప్పా మోరియా అనే పదాలతో కూడిన బ్యాండ్లను ధరించారు. దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్‌తో పంపుతున్నారని ప్రధాన కారణం. ఈ ప్రకటన హిందూ మతం, మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అశోక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇవే కాక సరయు ఈ వీడియోలో విచ్చలవిడిగా బూతులు వాడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన వీడియోని చూడండి.