బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అంతా లైఫ్ లో సెటిల్ అవ్వడం చూస్తూనే ఉన్నాము. కానీ.., ఒక్క షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో మాత్రం మ్యాటర్ పూర్తిగా రివర్స్ అయ్యింది. నిజానికి హౌస్ లోకి వెళ్లక ముందే షణ్ముఖ్ లైఫ్ చాలా బాగుండేది. అతనిని అంతా అభిమానించే వారు. ఎలాంటి నెగిటివిటి ఉండేది కాదు. స్టార్ హీరోలతో సమానంగా షణ్ముఖ్ వీడియోలకి రీచ్ ఉండేది. అన్నిటికీ మించి తాను ప్రాణంగా ప్రేమించే దీప్తి సునయన అన్నీ వేళల తన వెంట ఉండేది. కానీ.., బిగ్ బాస్ పుణ్యమా అంటూ.. షణ్ముఖ్ వీటన్నిటిని దూరం చేసుకున్నాడు. షణ్ముఖ్ హౌస్ లో సిరితో హద్దులు మీరడంతో ఒక్కసారిగా విలన్ అయిపోయాడు. దీంతో.. దీప్తి సునయన కూడా బ్రేకప్ చెప్పేసి దూరం అయిపోయింది.
చదవండి:
Bigg Boss OTT Telugu: కంటెస్టెంట్ గా పుష్ప యాంకర్..?
బ్రేకప్ తరువాత దీప్తి చాలా తక్కువ సమయంలోనే తన వర్క్ తో బిజీ అయిపోయింది. కానీ.., షణ్ముఖ్ మాత్రం ఆ బాధ నుండి బయటకి రాలేకపోతున్నాడు. భగ్న ప్రేమికుడిలా మారి సోషల్ మీడియాలో అతను పెడుతున్న పోస్ట్ లు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. త విషాద గీతాలు వింటున్నట్టు ఉన్న తన ఫోటోని షణ్ముఖ్ జస్వంత్ తాజాగా పోస్ట్ చేశాడు. దీంతో.., షణ్ముఖ్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని నెటిజన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ.., షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు మాత్రం ఈ విషయంలో ఓపెన్ గా కామెంట్ చేశాడు.
షణ్ముఖ్ పెట్టిన పోస్ట్ కి కామెంట్ ఇస్తూ.. “ఈ వయసులో ప్రేమ, బ్రేకప్ ఏంటి.. చదువుకోండి ఫస్టు” అంటూ షణ్ముఖ్ కి సరదాగా సెటైర్ వేశాడు. అంతేగాక.. తన సోదరుడిని ఉత్సాహపరిచేలా కూడా మరికొన్ని కామెంట్స్ చేశాడు.”మా లాంటి వాళ్లకు ఇంట్లో, ఫ్రెండ్స్, అమ్మా నాన్నల దగ్గరే ప్రేమ దొరుకుతుంది. కానీ.. నీలాంటి వాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది.. మున్ముందు దేశం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది అంటూ.. తన సోదరుడికి అండగా నిలిచాడు. ఏదేమైనా. కష్ట కాలంలో ఉన్న షణ్ముఖ్ కి తన సోదరుడు ఇలా అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.