షణ్ముఖ్ జస్వంత్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. షణ్నూ యూట్యూబ్ స్టార్ గా ఎదిగి యూత్ లో మంచి క్రేజ్ సంపాందించాడు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాడు. కానీ కొన్ని కారణాలతో బిగ్ బాస్ సీజన్-5 రన్నరప్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో సిరితో వ్యవహార కారణంగా దీప్తి సునయనతో లవ్ బ్రేకప్ అయిన సంగతి
తెలిసిందే. తాజాగా ఈ యూట్యూబ్ స్టార్ కొత్త ఇల్లును కొన్నాడు. గృహప్రవేశం కూడా పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అతనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : దీప్తి సునయనే నన్ను గెలికింది: బిగ్ బాస్ కౌశల్
షణ్ముఖ్ కొత్త ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో అతని వెంట ఛాయ్, బిస్కెట్ ఫేమ్ శ్రీ విద్య కూడా ఉంది. కాగా నూతన గృహంలోకి అడుపెట్టిన షణ్నూకి అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో సిరితో జరిగిన వ్యవహరాల కారణంగా దీప్తిసునయనతో బ్రేకప్ జరిగింది. ఈ లవ్ బ్రేకప్ తర్వాత ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎప్పటికప్పడు ప్రయత్నిస్తున్నాడు షణ్నూ. ఈ క్రమంలో తాజాగా షణ్ముక్ హైదరాబాద్ లో ఓ కొత్త ఇల్లు కొన్నాడు. గృహప్రవేశానికి సంబంధించిన పూజలో షణ్నూ పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.