బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో యాంకర్ శివ, బోల్డ్ బ్యూటీ సరయులకు మొదటి నుండే పడటం లేదు. యాంకర్ శివ వెటకారం చేస్తున్నాడని సరయు, అలాంటప్పుడు నాతో మాట్లాడకు అని శివ.. ఇలా ఇద్దరూ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. తాజాగా నామినేషన్స్ లో ఇద్దరి మధ్య మరోసారి వార్ నడిచింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మధ్యలో వేరే కంటెస్టెంట్స్ మాట్లాడటం వలన ఈ ఇద్దరి మధ్య వార్ మరింత పెరిగింది.
హౌస్ లో సరయుతో పాటు చాలా మందిపై యాంకర్ శివ పంచులు వేస్తుంటాడు. కానీ ఎవరు కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాడని అనలేదు. కానీ తాజాగా నామినేషన్స్ లో సరయు.. యాంకర్ శివ మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తాను భరించలేనని చెప్పింది. అందుకు సాక్ష్యంగా నటరాజ్ మాస్టర్ కూడా సరయుకి వత్తాసు పలికి.. ఫలానా డైలాగ్ అన్నావ్ అని క్లియర్ గా చెప్పడం గమనార్హం.
నిజంగా అంతమాట అని ఉంటే.. ఆ వీడియో చూపిస్తే నేనే హౌస్ లో నుండి వెళ్ళిపోతానని శివ శపథం చేశాడు. ఆ వెంటనే శివకి సపోర్ట్ గా హౌస్ మేట్స్ స్పందించి.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనలేదు అని చెప్పుకొచ్చారు. అయినా శివ నిన్ను, నీ పంచులను భరించలేనని సరయు తేల్చేసింది. అయితే.. మాట్లాడటం మానెయ్.. అంటూ శివ గొడవ ముగించేశాడు. ప్రస్తుతం నామినేషన్స్ వీడియో వైరల్ అవుతోంది. కానీ అసలు వార్ ఇప్పుడే మొదలైంది అంటున్నారు నెటిజెన్లు. చూడాలి ఏం నెక్స్ట్ వీక్ ఏం అవుతుందో.. మరి సరయు, శివలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.