బిగ్ బాస్ షోని ఆదరించే వారు ఉంటారు. అలానే విమర్శించే వారు కూడా ఉంటారు. తాజాగా ఈ షోపై యూట్యూబర్ సరయు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రియాలిటీ షోస్ తెర వెనుక ఏం జరుగుతాయో ఆమె బయటపెట్టారు.
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ఒకటి. దేశవ్యాప్తంగా ఈ షోకి అభిమానులున్నారు. ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. ఓ మోస్తరు సెలబ్రిటీలు ఐతే మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. అన్ని భాషల్లోనూ ఈ బిగ్ బాస్ షో హిట్ అయ్యింది. ఏడాదికి ఒక సీజన్ చొప్పున నిర్వహిస్తున్న ఈ షో.. మామూలు సెలబ్రిటీలను కూడా టీవీ ప్రేక్షకులకు దగ్గర చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగులో ప్రారంభమైన ఈ బిగ్ బాస్.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని ద్వారా రెండో సీజన్.. అనంతరం మూడో సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 7వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతుంది.
‘కుడి ఎడమైతే పొరపాటు లేదు అంటూ’ ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ షోకి ఎంత క్రేజ్ అయితే ఉందో అదే రేంజ్ లో విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఈ షోపై చాలా మంది విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్, బోల్డ్ బ్యూటీ సరయు ఈ షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న రియాలిటీ షోలన్నీ అబద్దం అని చెప్పుకొచ్చింది. కొంతమంది డబ్బులిచ్చి మరీ వారిని వారు ప్రమోట్ చేసుకోవడానికి షోకి వస్తారని.. షో యాజమన్యం కొంతమందిని కావాలని ప్రమోట్ చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అది చూసి నిజమేనని నమ్మి మనం పిచ్చోళ్ళం అవుతున్నామని, ఇలాంటి షోలు చూడకండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే తాను ఈ షోకి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసునని ఆమె అన్నారు. యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరయూ.. బిగ్ బాస్ సీజన్ 5తో పాటు ఓటీటీలో వచ్చిన నాన్ స్టాప్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్స్‌లోనూ మధ్యలోనే బయటకు వచ్చేసింది. బోల్డ్ కంటెంట్‌తో యుట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఫేమ్ సంపాదించుకుంది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించింది సరయూ. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన ’18 పేజిస్’లో కూడా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. మరి బిగ్ బాస్ షో పై సరయూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.