బిగ్ బాస్ షోని ఆదరించే వారు ఉంటారు. అలానే విమర్శించే వారు కూడా ఉంటారు. తాజాగా ఈ షోపై యూట్యూబర్ సరయు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రియాలిటీ షోస్ తెర వెనుక ఏం జరుగుతాయో ఆమె బయటపెట్టారు.
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అనేది సెలబ్రిటీలుగా మారేందుకు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. యూట్యూబ్ లో సక్సెస్ అయితే అంతే ఇక.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనేది వాస్తవం. యూట్యూబ్ ద్వారా ఫేమ్ పొంది.. బిగ్ బాస్ లో పాల్గొని సినిమా ఛాన్సులు రాబట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ యూట్యూబ్ అనేది ఎంత బాగా ఫేమ్ తీసుకొస్తుందో.. మనం పోస్ట్ చేసే వీడియోలలో ఏదైనా తప్పు జరిగిందంటే మాత్రం తీవ్రస్థాయిలో ట్రోల్స్ […]
ప్రియా అంటే అక్కగా, అమ్మగా, వదినగా తెలుగు వారికి పరియమైన వ్యక్తి. సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. బిగ్ బాస్ షో తో తనను ఇంకో స్థాయికి పెంచుకుంది. అయితే ఈ నెల 21న ప్రియా ఇంట్లో ఆమె అక్క కూతురు లోహిత వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్-5 తెలుగులోని తన సహచరులను ఆహ్వానించింది. ఆ పెళ్లి వేడుకలో ఇప్పటి వరకు ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన […]
‘7ఆర్ట్స్ సరయు’ బోల్డ్ కంటెంట్‌తోనే మెసేజ్ ఇస్తూ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో హౌస్‌లోకి ఎంటర్ అయిన సరయు.. మొదటివారంలోనే ఎలిమినేట్ అవ్వడం పెద్ద చర్చకే దారి తీసింది. అలా వచ్చేస్తుందని అభిమానులే కాదు.. ఆమె కూడా నమ్మలేకపోయిన విషయం. బిగ్‌బాస్ తర్వాత సరయు మళ్లీ బుల్లితెర మీద తళుక్కుమంటోంది. కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఎక్స్‌ప్రెస్ హరి స్కిట్టులో మెరిసింది. మెరవడమే కాదు హరిని […]
సరయు అలియాస్ ‘7 ఆర్ట్స్ సరయు’.. ఈ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఒక జోష్ గుర్తొస్తది. ఆమెకు యూట్యూబ్ అర్జున్ రెడ్డి అని కూడా పేరుంది. అలాంటి ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తోందింటే అందరూ టాప్ 5 కంటెస్టెంట్ వచ్చింది అనుకున్నారు. ఇక, బిగ్ బాస్ హౌస్ మొత్తం రచ్చ రంబోలా కాబోతోందని ఊహించుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. మొదటివారమే ఎలిమినేట్ అయ్యింది. ఇంటి నుంచి బయటికొచ్చేసింది. బిగ్ బాస్ 5 తెలుగులో […]
సక్సెస్‌పుల్‌గా నడుస్తున్న బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు’. ఈసారి ఆట చాలా జోష్‌గా నడుస్తోంది. హౌస్‌లోకి కంటెస్టెంట్లు అడుగుపెట్టి అప్పుడే వారమైపోయింది. ఆరుగురు నామినేషన్స్‌లో ఉంటే ప్రేక్షకులు తలచింది ఒకటి.. అక్కడ జరుగుతోంది ఒకటి అంటూ పుకార్లు మొదలైపోయాయి. దానికి అసలు కారణం మొదటి వారంలో సరయుని ఎలిమినేట్ చేయడమే. ఓటింగ్ ప్రకారం చూసినా.. సరయుకి ఎక్కువ ఓట్లే వచ్చుంటాయని అందరూ భావిస్తున్నారు. అసలు సరయు ఎలిమినేట్ అనగానే బుల్లితెర, యూట్యూబ్ అభిమానులు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు సరయూ బయోడేటా గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి […]