బిగ్ బాస్ : డేంజ‌ర్ జోన్‌లో ఆ న‌లుగురు.. ఎలిమినేషన్ పై ఉత్కంఠ!

బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఇంటి సభ్యులు ఎవరు తప్పు చేస్తే వారు పదిహేను సెకన్లలో లేచి చేసిన తప్పు ఏంటి అనేదానికి వివరణ ఇవ్వాలని కోరారు.. దీనికి మొదట జెస్సీ లేచి తాను కెప్టెన్సీగా ఓడిపోయానని ఒప్పుకున్నాడు. దానికి నిన్ను అందరూ వాడేస్తున్నారు.. తొక్కేస్తున్నారని అన్నారు. ఇక శ్వేత నిన్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పకుండా ఉండాల్సింది.. ఆ సమయంలో నేను సరైన స్టాండ్ తీసుకోలేదని ఒప్పుకుంది.

bigar minఆ తర్వాత ఎవరూ లేచి సమాధానం చెప్పలేదు. తర్వాత లోబో విషయంలో నాగ్ కాస్త చిరాకు పడ్డారు. ‘నీ ఒక్కడికే ఉంది ప్రేమ ఇంకెవరికీ లేదు’ అని కామెంట్ చేశారు నాగ్. ‘మాట్లాడితే బస్తీ నుంచి వచ్చాను.. ఇది బిగ్ బాస్ హౌజ్.. ఇది బస్తీ కాదు, విల్లా కాదు.. అందరూ ఒక్కటే’ అంటూ ఫైర్ అయ్యారు నాగ్. కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ రివార్డ్స్ ప్రకటించారు. కొందరికి కేక్, మరికొందరికి మఫిన్స్ ఇచ్చారు. సిరి, షణ్ముఖ్ లను నుంచోమని చెప్పి వారి ముందు మిర్చీలు ఉంచి వారిద్దరినీ తినమన్నారు. ఇక నీ ఫైర్ పోయిందని.. కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే’ అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు నాగ్ ‘నీలో ఉన్న ఫైర్ ని బయటకు తీయడానికి మిర్చి ఇచ్చానని’ అన్నారు.

bigare minఆ తరువాత సిరిని ఉద్దేశిస్తూ.. ‘నీ ఆట నువ్ ఆడమ్మా’ అని అన్నారు. సిరి-షణ్ముఖ్ లను ఉద్దేశిస్తూ.. మీ కారణంగా జెస్సీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అన్నారు నాగ్. ఇక నామినేష‌న్‌లో ఉన్న ర‌వి, స‌న్నీ, కాజ‌ల్, ప్రియ‌ సేవ్ కాగా లోబో, అనీ మాస్ట‌ర్, సిరి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే ఏంటో అర్థం అవుతుంది.