Fined For Crying: ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘అహల్య అమాయకురాలు’’ కామెడీ సీన్లో పవన్ కల్యాణ్, బ్రహ్మానందాన్ని ప్రతీ సారి తప్పులు వెతికి మరీ కొడుతుంటాడు. ‘‘ నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను’’ అంటాడు. అలా పవన్ కల్యాణ్, బ్రహ్మానందాన్ని కొట్టడానికి పాయింట్లు వెతికినట్లు. ఓ ఆసుపత్రి డబ్బులు దండుకోవటానికి ఏకంగా పేషంట్ ఏడుపుకు డబ్బులు వసూలు చేసింది. డాక్టర్ కన్సల్టేషన్ సందర్భంగా ఏడ్చిదని పేర్కొంటూ ఏకంగా మూడు వేలు వసూలు చేసింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఫేమస్ యూట్యూబర్ కెమిల్లే జాన్సన్ చెల్లెలు గతకొద్ది రోజులనుంచి ఓ మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమె కొద్దిరోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్తో తన బాధను చెప్పుకుని ఏడ్చింది. వైద్యులు ఆమెకు కొన్ని పరీక్షలు చేశారు.
అంతా అయిపోయిన తర్వాత ఆసుపత్రి బిల్లు వచ్చింది. అందులో టెస్టులతో పాటు ఏడ్చినందుకు అదనంగా 40 డాలర్ల వసూలు చేశారు. మన ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు 3,100 రూపాయలు. అది చూసిన ఆమె షాక్ తింది. ఆసుపత్రిలో ఏమీ మాట్లాడలేక, డబ్బులు కట్టి ఇంటికి వచ్చింది. దీన్ని కెమిల్లేకు చెప్పుకుంది. కెమిల్లే ఇందుకు సంబంధించిన ఆసుపత్రి బిల్లును తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ బిల్లు కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఏడ్చినందుకు డబ్బులు వసూలు చేయటం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి భాషలో ఫైన్ కాదు.. పేషంట్ భావోద్వేగాలను అంచనా వేయటం కోసం చేస్తున్న ఛార్జ్.. కానీ, షేషంట్ విషయంలో మాత్రం చేసిన తప్పుకు శిక్ష లాంటిది. మరి, ఏడుపుపై ఫైన్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
My little sister has been really struggling with a health condition lately and finally got to see a doctor. They charged her $40 for crying. pic.twitter.com/fbvOWDzBQM
— Camille Johnson (@OffbeatLook) May 17, 2022
ఇవి కూడా చదవండి : Viral Video: మరి కొద్దిసేపట్లో పెళ్లి.. కుక్క కోసం వరుడి సాహసం..