అర్ధరాత్రి నిద్ర మత్తులో యువకుడు.. ప్యాంట్‌లోకి దూరిన నాగు పాము..!

snake

ఈ మధ్యకాలంలో నాగుపాముల బెడద విపరీతంగా పెరిగిపోయింది. పైగా వర్షకాలం కావటంతో పాములు ఏకంగా ఇంట్లోకి రావటం మాత్రమే మనం చూశాం. కానీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇంట్లోకి రావటమే కాకుండా ఏకంగా ఓ వ్యక్తి ప్యాంట్‌లోకి దూరిపోయి చుక్కలు చూపించింది. వినటానికి భయంగా ఉన్న ఇదే నిజం.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్‌ పరిధిలోని ఓ గ్రామం. విద్యుత్ కార్మికుడిగా పనులు చేస్తున్న ఓ వ్యక్తి ఉదయం నుంచి పని ముగించుకుని సాయంత్రం వేళ ఇంటికి చేరుకున్నాడు. ఇక కష్టపడి పని చేస్తాడు గనుక అలసిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక సమయం అర్ధరాత్రి దాటింది. నాగు పాము ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఏకంగా నిద్రమత్తులోకి జారుకున్న మనోడి ప్యాంట్ లోకి మాత్రం దూరిపోయింది.

ఇక మెలుకువ వచ్చి చూసే సరికి పాము దూరిందని మాత్రం పక్కగా తెలిసిపోవటంతో మనోడి ప్యాంట్ తడిసిపోయింది. ఇక అతడికి ఏం చేయాలో తెలియక కదిలితే ఎక్కడ కాటు వేస్తుందో అని భయంతో ఊపిరి బిగబట్టాడు. మెల్లగా పక్కనున్న స్తంభం వద్ద లేచి నిలబడ్డాడు. అలా రాత్రి నుంచి ఏకంగా అలాగే 7 గంటల పాటు అక్కడే నిలబడి నరకాన్ని దగ్గర నుండి చూశాడు. ఇక ఈ విషయం స్థానికులకు తెలియటంతో పాము పట్టే వాళ్లకు సమాచారం అందించారు. వెంటనే పరుగుల మధ్య వచ్చిన పాములు పట్టే వ్యక్తి చాకచక్యంగా అతని ప్యాంట్ దూరిన నాగు పామును బయటకు తీశాడు. ఇక అంతా అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. కార్మికుడు సురక్షితంగా భయటపడి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెల్చేశారు. 2020 జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.