ఈ బుడ్డోడి డ్యాన్స్ కి ఫిదా అయిపోతారు!

cute video of a little boy dancing with a group

చిన్న పిల్లలు ఏమి చేసినా ముద్దుగానే ఉంటుంది. వారి ముద్దు ముద్దు మాటలు, అల్లరి పనులు, ఆటలు, పాటలు అన్నీ అద్భుతమే. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలు. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా.., అన్నీ మరచిపోయి వారితో సేద తీరవచ్చు. ఇక.. అడుగులు కూడా తడబడే సమయంలో వీరు ముద్దు ముద్దుగా డ్యాన్స్ వేస్తే చూపులు తిప్పుకోవడం దాదాపు అసాధ్యమే. నిజానికి ఒక్కోసారి పెద్ద వాళ్లకన్నా వీళ్ళ డ్యాన్స్ సూపర్ గా ఉంటుంది. తాజాగా ఓ బాలుడు వేసిన ఇలాంటి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Little boy dance viral videoఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం రకరకాలుగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా ఓ ఓపెన్ ప్లేస్ లో అందరూ కలసి డ్యాన్స్ లే వేయడం నయా ట్రెండ్ గా మారింది. అచ్చం ఇలాగే ఓ పార్క్‌లో కొంత మంది పలు వరసల్లో నిలబడి గ్రూప్‌గా డ్యాన్స్‌ ప్రాక్టిస్‌ చేస్తున్నారు. వారి పక్కనే ఓ చిన్న పిల్లవాడు కూడా వాళ్లను అనుకరించారు. వారు చేస్తున్న స్టెప్పలను వారికంటే అద్భుతమైన గ్రేస్‌తో చేశాడు. అతని డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చాలా సహజంగా ఉన్నాయి. అతని నృత్యం పార్క్‌లో ఉన్న చూపరులను ఆకట్టుకుంది.

ఈ వీడియోను మాజీ ప్రొఫెషనల్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘డ్యాన్సర్లతో పాటు బుడ్డోడు చేసిన నృత్యం అద్భుతం. మీరు తప్పకుండా చూడాలి’ అంటూ రెక్స్‌ చాప్మన్‌ దీనికి క్యాప్షన్ కూడా జత చేయడం విశేషం. ఇప్పటికే ఈ వీడియోని ఇప్పటికే 1.9 మిలియన్‌ నెటిజన్లు వీక్షించారు. 90 వేల మందికి పైగా కామెంట్లు చేశారు. బుడ్డోడు మా కంటే చాలా బాగా డ్యాన్స్‌ చేస్తున్నాడు.పెద్దయ్యాక ఈ పిల్లవాడు మంచి డ్యాన్సర్‌ అవుతాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.