సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికి హర్షసాయి పేరు తెలిసే ఉంటుంది. పేదవారికి సాయం చేస్తూ అతడు చేసే వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. అలాంటి హర్షసాయి కొన్నాళ్లుగా వీడియోలు పెట్టడం లేదు. అలాంటి అతడు మరో కొత్త వీడియోతో వచ్చేశాడు.
హర్షసాయి.. ఈ పేరు తెలియని నెటిజన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండేవారికి కూడా ఈ పేరు సుపరిచితమే. పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. యూట్యూబ్‌లో హర్షసాయికి దాదాపుగా 80 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటి హర్షసాయి గత కొన్నాళ్లుగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఆరు నెలలుగా వీడియోలు అప్లోడ్ చేయడం లేదు. చివరగా గతేడాది అక్టోబర్‌లో హర్షసాయి ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. అప్పటి నుంచి కొత్త వీడియోస్ పెట్టడం లేదు. దీంతో అతడికి ఏమైందంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు హర్షసాయి. తన వీడియోల కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ కొత్త వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేశాడు. దీంతో అతడికి ఏమైందంటూ వస్తున్న అనుమానాలకు తెరపడినట్లయింది. కొత్త వీడియోలోనూ ఎప్పటిలాగే సాయం చేస్తూ కనిపించాడు హర్షసాయి. ఈసారి పాలు అమ్ముకునే ఓ వ్యక్తిని లక్షాధికారిని చేశాడు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న అతడి పిల్లాడికి హర్షసాయి అండగా నిలవడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆ కుటుంబం పాల వ్యాపారం చేసుకోవడానికి వీలుగా గేదెలు, షెడ్‌ను ఏర్పాటు చేసిన హర్షసాయి.. పిల్లాడి ట్రీట్మెంట్కు అవసరమైన ఖర్చులను తానే భరించడాన్ని అందులో చూడొచ్చు. మరి.. హర్షసాయి కొత్త వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.