విజయానికి చదువే ముఖ్యం కాదని, గొప్పగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.. ఓయువకుడు. తన తెలివితేటలను ఉపయోగించి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టి విజయం సాధించి.. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఈ యువకుడు ఏం చేశాడనుకుంటున్నారా! కరెంట్ అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను చక చకా పైకి లాగేస్తున్నాడు.
ఆలోచనలే ఆవిష్కరణలకు మూలమన్న శాస్త్రీయ దృక్పథాన్ని నిజం చేస్తున్నాడు ఓ యువకుడు. విజయానికి చదువే ముఖ్యం కాదని, గొప్పగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు. తన తెలివితేటలను ఉపయోగించి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టి విజయం సాధించి.. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఈ యువకుడు ఏం చేశాడనుకుంటున్నారా! కరెంట్ అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను చక చకా పైకి లాగేస్తున్నాడు. అదెలా అనుకుంటున్నారా! ఐతే ఇది చదివేయండి.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని ఆలోచింపజేసేవిగా ఉంటే, మరికొన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇంటిపక్కనున్న ఓ బావి నుంచి కరెంటు అవసరం లేకుండా నీటిని చక చకా పైకి లాగేస్తున్నాడు.. ఓ బాలుడు. ఒక పొడవాటి కర్ర చివరి కొనను టైరు లోపలకి చొప్పించి.. దాని కింద బాగాన చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశాడు. దాని సహాయంతో నీటిగుంట నుంచి నేరుగా నీటిని బయటకు తీసువచ్చి చిన్న బకెట్ లో నింపడం మనం చూడొచ్చు.
మొదట పొడవాటి కర్రను తీసుకొని.. దానికి ఒకవైపు బరువును, మరోవైపు టైరును చొప్పించాడు. ఆ టైరు కింద బాగాన సన్నని వాటర్ పైప్‌ను జోడించి, దాని ద్వారా నీటిని పైకి తీసుకురావడంజరిగింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచేలా లేకపోయినా.. ఆ బాలుడి తెలివితేటలను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి పలువురు నెటిజన్స్ అతని తెలివితేటలను మెచ్చుకుంటూ కామెంట్స్ చేయటం గమనార్హం. ‘నీ తెలివితేటలు అమోఘం.. నువ్వు అసలైన ఇంజనీర్ బ్రదర్..’ అంటూ అతని ఆలోచనను మెచ్చుకుంటున్నారు. పైగా బీటెక్ స్టూడెంట్స్ ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయాలంటూ.. పలువురు సూచిస్తున్నారు. బీటెక్ అయిపోగానే సాఫ్ట్ వేర్ రంగం వైపు పరుగులు తీయడం కాదని.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించినప్పుడే ఆ చదువుకు అర్థముంటుందని జ్ఞానబోధన చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4లక్షలకు పైగా వ్యూస్, 5వేల వరకు లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను మీరూ తిలకించి.. మీబహిప్ర్యాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Skills > Degree. pic.twitter.com/kgWOVZprQI
— Mindset Machine (@Mindset_Machine) March 14, 2023