ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటివి విద్యార్థులు, ఉద్యోగాలు చేసే వారికే కాదు.. ఇంట్లో ఉండే రెండేళ్ల పిల్లలకు కూడా తెలుసు. వారికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే యూట్యూబ్‌లో వాళ్లే వీడియోలు పెట్టకుని చూసుకుంటున్నారు. అంతేకాకుండా అలాంటి చిచ్చర పిడుగులు చేసే అల్లరి, చెప్పే మాటలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారడం చూశాం. ఇప్పుడు చెప్పుకోబోయే చిచ్చర పిడుగు చెప్పిన మాటలు మాత్రం నెక్ట్స్ లెవల్ అనాల్సిందే.
ఈ బుడ్డోడు గోదావరి యాసలో వచ్చీరాని మాటలతో నత్తి నత్తిగా మాట్లాడిన ఈ పిల్లాడు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు. చిన్న పిల్లాడని కూడా చూడకుండా మాస్టారు గట్టిగా కొట్టారంటూ.. ఆ బుడ్డోడు పలికించిన హావభావాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ.. సార్ దే తప్పు. ఆయన కొట్టడం చూపిస్తే మీకు కూడా ఏడుపొచ్చేత్తది” అంటూ వాడు చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది తప్పు అంటూ ఓ పెద్దమనిషిలా ఆ బుడ్డోడు మాట్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎంతో చక్కగా గోదావరి యాసలో పిల్లాడు మాట్లాడిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. ఓ అమ్మాయి చిన్నోడి మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. అయితే ఆ పిల్లాడు ఎవరు? వాళ్లది ఏ ఊరు అనేది మాత్రం తెలియలేదు ఈ చిచ్చర పిడుగు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.