మొహరం పండుగ వచ్చిందంటే చాలు.. నెల్లూరు పట్టణం జనాలతో కిటకిటలాడుతోంది. పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నెల్లూరు బారా షహీద్ దర్గా వద్దకు చేరుకుంటారు. కారణం అక్కడ నిర్వహించే రొట్టెల పండుగ. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ పండుగలో హిందువులు కూడా అధికంగా పాల్లొంటారు. రొట్టెల పండుగ హిందూ-ముస్లింల మధ్య మత సామరస్యానికి ప్రతీకగా. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగను నిర్వహించలేదు. ఈ క్రమంలో ఈ సారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంది. ఏపీలో రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకలో పాల్గొనడానికి వేర్వురు రాష్ట్రాల నుంచి భక్తుల భారీగా తరలి వస్తారు. రొట్టెల పండుగ ప్రాధాన్యతేంటి.. ఈ రొట్టెల పండుగలో ఎక్కువగా మహిళలే పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ పండుగ నిర్వహణ వెనక ఓ చారిత్రక కథ ప్రచారంలో ఉంది. అప్పటి ఆర్కాటు నవాబు ఒకరు ఆయన కోరిన కోరిక నెరవేరడంతో మరుసటి సంవత్సరం దర్గాకు వచ్చి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ.. స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ సంఘటన తర్వాతనే ఈ దర్గాలో రొట్టెలపండుగ ప్రారంభమైందని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. ఇక 1930 సంవత్సరంలో ఈ రొట్టెల పండుగ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా పండుగ నిర్వహిస్తున్నట్లు స్థానిక పత్రికలలో వార్తలు వచ్చినట్లు ఆధారాలున్నాయి. ముందుగా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చపాతీలు(రొట్టెలు) చేసుకుని వస్తారు. ఆ తర్వాత చెరువులోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని భక్తులు పరస్పరం రొట్టెలు మార్పిడి చేసుకుంటారు. రకరకాల పేర్లతో రొట్టెలు వదులుతారు. అంటే ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించిన రొట్టెలకు బదులుగా.. తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు. ఇక ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లాలోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. ఇక ఈ చెరువు వద్ద వున్న ఏపీ పర్యాటకం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం కూడా జరుగుతుంది. చారిత్రక నేపథ్యం.. ఆర్కాటు నవాబుల కాలంలో రజకులు(చాకలి వారు) నెల్లూరు చెరువు వద్దకు వచ్చి బట్టలు ఉతికేవారు. ఈ క్రమంలో ఓ రజకుల జంట చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోయి చీకడి పడుతుంది. దాంతో వారు అక్కడే నిద్రపోయారు. ఈ క్రమంలో అక్కడ సమాధులైన బారా షహీద్‌లు రజకుని భార్య కలలోకి వచ్చి.. ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని చెబుతాయి. అంతేకాక సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి నవాబు భార్య నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పి మాయమవుతారు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత రజకుని భార్య.. తనకు రాత్రి వచ్చిన కలనే తలుచుకుంటూ ఉంటుంది. ఇక బట్టలు ఉతికే పి ముగియడంతో భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా.. ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని.. ఆమెకు మంచి వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. ఈ చాటింపు వినగానే రజకుడి భార్య.. తనకు రాత్రి కలలో వచ్చిన సంఘటన గురించి వివరిస్తుంది. అనంతరం భార్యాభర్తిలద్దరూ నవాబు ఆస్థానానికి వెళ్లి.. తమకు ఎదురైన అనుభవం గురించి చెబుతారు. వారి మాటలు విన్న నవాబు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని భార్య నుదుటిపై పూస్తాడు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. భార్య కోలుకున్న వెంటనే ఆ నవాబు ఆమెతో కలిసి.. నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి అక్కడ ఉన్న బారా షహీదులకు ప్రార్థనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి ఆచారం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక ఇక్కడ కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇస్తారు. అలానే కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకుంటారు. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకునే ఆనవాయితీ కాస్త కాలక్రమంలో రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను కేవలం మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కానీ కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువకావడం.. కులమతాలకు అతీతంగా అందరూ వేడుకలో పాల్గొనడంతో.. ప్రస్తుతం ఈ 4-5రోజుల నిర్వహిస్తునన్నారు. మరి.. ఈపండుగ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇలాంటి కొడుకు ఒక్కడు చాలు.. కళ్లులేని తల్లికి అన్నీ తానై! ఇదీ చదవండి: అమ్మవారి గుడిలోంచి గాజుల, గజ్జెల శబ్ధాలు.. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఇదీ చదవండి: రామాయణ క్విజ్ విజేతలుగా ముస్లిం విద్యార్ధులు.. ...