టిక్‌టాక్, రీల్స్, మాజ్, రొపొసో పేరు మార్పేమో గానీ, వాటి పని మాత్రం ఒక్కటే మీ టైమ్ కరాబ్ చేయడం. వాటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు, కోర్టు మెట్లు ఎన్నిక వారు, ఏకంగా ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకున్నవారు కోకొల్లలు. అలాంటి వీడియోనే ఈ లేడీ కానిస్టేబుల్ కొంప ముంచింది.
ఆగ్రాలో తుపాకీ పట్టుకొని డైలాగులతో హడావుడి చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ… పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశారు. ఆ ఒక్కటే కాదు ఇంకా చాలా వీడియోలే చేశారు కానిస్టేబుల్. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక మిశ్రా అనే కానిస్టేబుల్ ఓ హిందీ డైలాగ్‌కు లిప్ సింక్ చేస్తూ వీడియో తీశారు. ‘‘హరియాణా, పంజాబ్ అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకున్నాయి. ఇక్కడికి రండి. ఇక్కడ ఐదేళ్ల పిల్లలకు కూడా తుపాకులు వాడటం తెలుసు’’ అంటూ వివాదంలో చిక్కుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ‘ప్రవర్తనా నియమావళిని మహిళా కానిస్టేబుల్ ఉల్లంఘించారు. ఆ వీడియో మా దృష్టికి వచ్చింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాం’ అని ఆగ్రా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.