పల్లెటూర్లలో కుక్కలను పెంచుకోవడం సర్వ సాధారణం. ఎందుకంటే దొంగల నుంచి తమ ఇంటిని అలాగే తమ పశు సంపదను కాపాడతాయని. కాలక్రమేనా కుక్కల పెంపకం మారింది. వాటిని కుటుంబంలో ఒక వ్యక్తిగా చూడడం మెుదలు పెట్టారు. ఇక పట్టణాల్లో అయితే దాదాపుగా ఇంటికి ఒక కుక్క ఉండాల్సిందే. వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైన వారు వెనకాడరు. మరి అలాంటి కుక్కకు ఆపద వస్తే? తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాన్ని రక్షిస్తారు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేదురా నీకు”.. అంటారు పెద్దలు పలు సందర్భాల్లో. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు శునకాలు ఎంత విశ్వాసంగా ఉంటాయో. వాటికి తగ్గట్టుగానే మనం కూడా వాటిని గారబంగా పెంచుతాం. మరి అలాంటి కుక్కకు ఆపదొస్తే వదులుతామా? అలాగే చేశారు ఈ కుర్రాళ్లు.. ఇంతకీ ఏం చేశారు అనేగా మీ అనుమానం పదండి మరి తెలుసుకుందా.
సరదాగా ఆడుకుందాం అని తమ పెంపెడు కుక్కతో పార్క్ కు వెళ్లారు పిల్లలు. వారి ఆటల్లో వారు ఉండగా అక్కడకు ఓ కొండ చిలువ వచ్చింది. అక్కడ ఉన్న కుక్కను పట్టుకుంది. దాని నడుమును చుట్టి ఊపిరి ఆడకుండా చేసింది. ఆ బాధతో కుక్క అరవడం ప్రారంభించింది. కొండచిలువ నుంచి విడిపించుకోవడానికి అటూ ఇటూ పాకులాడింది. అయినా అది విడవలేదు. ఇంతలో పిల్లలు ఈ దృశ్యాన్ని చూశారు.
వెంటనే అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుక్కను విడిపించే ప్రయత్నం చేశారు. మొదట సాధ్యం కాకపోయినా.. పట్టువిడవ లేదు. ధైర్యంగా ఓ బాలుడు కొండచిలువ తలను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే మిగతా పిల్లలు కొండచిలువ తోకను పట్టుకుని పక్కకు లాగారు. కొద్ది సేపు పోరాటం తర్వాత ఎట్టకేలకు కుక్కను క్షేమంగా బయటపడేశారు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఆ పిల్లలపై ప్రశంసలు కురింపిచారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తు.. ”మీ ధైర్య సాహసాలకు అభినందనలు”. ”ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధైర్యం.. హేట్సాఫ్” అంటూ ప్రశంసలు కురిపించారు. మరి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుక్కను కాపాడిన పిల్లలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
These kids 👏👏 pic.twitter.com/fa2yQH71Eo
— figen sezgin (@_figensezgin) August 5, 2022