అదో చిన్న విమానం. నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్న ఆ విమానం ఆకాశంలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పైలట్ కు అతని సీటు కింద ఓ పాము కనిపించింది. ఆ సీన్ చూసి అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో అతడు ఏం చేశాడు? తర్వాత ఏం జరిగిందంటే?
దక్షిణాఫ్రికాలోని ఓ ఎయిర్ పోర్టు నుంచి ఇటీవల ఓ చిన్న విమానం నలుగురు ప్రయాణికులతో బయలు దేరింది. ఆకాశంలో ఆ విమానం దూసుకెళ్తుంది. ఇక అందులో ఉన్న ఆ నలుగురు ప్రయాణికులు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అయితే కొద్దినిమిషాల తర్వాత పైలట్ కు అతని సీటు కింద ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని కిందకు తొంగి చూడగా.. అతనికి ఓ పాము కనిపించింది. ఆ సీన్ చూసిన పైలట్ కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో అతడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దక్షిణాఫ్రికాలో సోమవారం ఓ విమానం వారెస్టర్ నుంచి నెల్‌స్ప్రూట్ కు బయలు దేరేందుకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే పైలట్ ఎరాస్మస్ ప్రయాణానికి ముందు విమానాన్ని పరిశీలిస్తుండగా.. ఆదివారం విమానం రెక్కలో ఓ పామును చూశానని ఎయిర్ ఫీల్డ్ సిబ్బంది పైలట్ కు చెప్పాడు. దీంతో పైలట్ తో పాటు అందరూ కలిసి ఆ విమానం రెక్క విప్పి చూశారు. పాము జాడ ఎక్కడా కనిపించలేదు. అది ఈపాటికి వెళ్లిపోయి ఉంటుందని అందరూ అనుకుని విమానం ఎక్కారు. ఇక కొద్దిసేపటి తర్వాత విమానం బయలు దేరి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంది. ఇక విమానం గాలిలో ఉండగా పైలట్ సీటు కింద ఏదో కదులుతున్నట్లు శబ్దం వినిపించింది.
ఏంటా అని పైలట్ ఎరాస్మస్ అతని సీటు కిందకు తొంగి చూడగా.. అతనికి ఓ పాము కనిపించింది. దీనిని చూసిన పైలట్ ఎరాస్మస్ కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక విమానంలో ఉన్న నలుగురి ప్రయాణికులకు ఈ విషయాన్ని చెప్పాడు. ఎవరో భయపడొద్దని, మనం క్షేమంగానే కిందకు దిగుతామని వివరించాడు. ఇక తర్వాత పైలట్ ఎరాస్మస్ జొహాన్నెస్‌బర్గ్‌లోని కంట్రోల్ టవర్‌కు ఎమర్జన్సీ ల్యాండింగ్ గురించి సమాచారం అందచేశారు. మొత్తానికి చాకచక్యంగా వ్యవహరించి పైలట్ ఆ విమానాన్ని కొద్దిసేపటి తర్వాత వెల్కోమ్ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత వెంటనే అందులో ఉన్న నలుగురు ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. దీంతో పైలట్ తో పాటు విమానంలో ఉన్న నలుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.