మానసిక ప్రశాంతత కోసం, మన కోరికలు దేవుడికి చెప్పేందుకు గుడికి వెళ్తుంటాము. అలా వెళ్లిన క్రమంలో గుడిలో ఉన్న పూజారి సాయంతో కొబ్బరికోయ కొట్టిన, వాహన పూజ చేసినా వారికి తోచిన దక్షిణం ఇవ్వడం జరుగుతుంది. తమ తరుఫున పూజా చేసే పూజారి ఉన్న గుడికి వెళ్లేందుకే చాలా మంది భక్తులు మొగ్గుచూపుతుంటారు. అలా వెళ్లిన కొంతమంది భక్తులకు గుడిలో ఊహించని ఘటన ఎదురైంది.
తమ తరుఫున పూజ చేసిన పూజారికి కొంత మంది ఎంతో కొంత దక్షిణం ఇస్తుంటారు. ఇలా ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో శివాలయంలో ఇద్దరు పూజారులు ఒకరి జట్లు ఒకరు పట్టుకుని తన్నుకున్నారు. ఇష్టమొచ్చిన రీతిలో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ ప్రశ్న.
గుడిలోనే కొట్టుకున్న ఇద్దరు పూజారులు! pic.twitter.com/hgI40NcF8u
— Rajasekhar (@Rajasek61450452) May 29, 2022
ఇది కూడా చదవండి: Kathua District: సరిహద్దులో భారీ ఉగ్రకుట్ర.. బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సూర్యపేట జిల్లాలోని మోళ్ల చెరువులోని ఓ శివాలయం. ఆ శివాలయ ప్రధాన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ ఆదేశాల మేరకు నరసింహ అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించారు. ఇక పూజ అనంతరం భక్తులు ఆయనకు దక్షిణం సమర్పించారు. ఆ భక్తులు ఇచ్చిన దక్షిణాన్ని నాకు ఇవ్వాలంటూ ఆలయ జూనియర్ ధనుంజయ శర్మ నరసింహను అడిగాడు. దీంతో వెంటనే నరసింహ బదులిస్తూ ప్రధాన అర్చకుడిని అడిగి డబ్బులు ఇస్తానని సమాధానమిచ్చాడు.
నరసింహ అలా చెప్పడంతో ఇక ధనుంజయ శర్మకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇంతటితో ఆగకుండా ధనుంజయ శర్మ నరసింహపై దాడి చేశాడు. ఇదే దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారాయి. దీనికి స్పందించిన ఆలయ అధికారులు దాడి చేసిన పూజారికి మోమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.