క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలంగా సారా టెండూల్కర్.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలకు ఎలాంటి విషయాలైనా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఆరాటం ఫ్యాన్స్ లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అసలే వారి చుట్టూ రెగ్యులర్ గా ఏవేవో రూమర్స్ వినిపిస్తుంటాయి. వీటన్నింటి మధ్య అసలు నిజం ఏంటనేది? తెలుసుకోవాలని ఆరా తీస్తుంటారు నెటిజన్స్. కాగా.. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సచిన్ కూతురిగా అందరికీ తెలిసినప్పటికీ.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. పార్టీస్, పబ్స్.. ఇలా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే.. రీసెంట్ గా లండన్ లో తన మెడిసిన్ చదువుతూ గ్రాండ్యుయేషన్ పూర్తి చేసింది.
ఈ క్రమంలో కొంతకాలంగా సారా టెండూల్కర్.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎప్పుడు కలిసి కనిపించలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు రియాక్ట్ అవుతూ.. లైక్స్ కొడుతూ కంటపడేసరికి ఇద్దరూ డేటింగ్ లో, లవ్ లో ఉన్నారంటూ కథనాలు గుప్పుమన్నాయి. ఇటీవల శుభ్ మన్ గిల్..న్యూజీల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ, తర్వాత టీ20 సెంచరీ చేసినప్పుడు కూడా సారా, సచిన్ లను ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు నెటిజన్స్. కానీ.. వీరిద్దరి గురించి బయట ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఏ ఒక్కరూ అటు అవునని, కాదని క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండటం గమనార్హం.
సారా – గిల్ ఏ ఒక్క విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో మరింత ఎక్కువ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సారా – గిల్ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు ఒకే హోటల్ లో ఉన్నారంటూ.. ఫోటోలలో కనిపిస్తున్న హోటల్ వాతావరణాన్ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఆ హోటల్ లో సారా దిగిన పిక్ రెండేళ్ల క్రితంది. 2021 జులైలో సారా పోస్ట్ చేయగా.. ఈరోజు గిల్ అదే హోటల్ లో దిగిన పిక్ పోస్ట్ చేయడం చర్చలకు దారితీసింది. దీంతో అందరూ ఇద్దరూ కలిసి వెళ్లారని.. వాలెంటైన్స్ డే కలిసి జరుపుకున్నారని వార్తలు హైలెట్ చేస్తూ.. ఫోటోలు వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో పిక్స్ అయితే పాతవే. కానీ.. అప్పుడు దిగిన పిక్, గిల్ ఇప్పుడు షేర్ చేసి ఉండొచ్చు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి సారా – గిల్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.