Viral Video: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే తప్పదోవ పడుతున్నారు. కొంతమంది పోలీసులు తాము సాధారణ పౌరులకంటే ప్రత్యేకం.. అధికం అన్న భావనలో ఉన్నారు. తమకో రూలు.. సాధారణ ప్రజలకో రూలు అన్నట్లు ప్రవర్తిస్నునారు. తాజాగా, ఓ పోలీస్ హెల్మెట్ పెట్టుకోమని సలహా ఇచ్చినందుకు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా అతడ్ని అడ్డగించి బెదిరింపులకు దిగాడు. మర్యాద లేకుండా మాట్లాడాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, న్యూ అవాడి రోడ్లో ఓ వ్యక్తి బైకు నడుపుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు అతడికి హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కనిపించాడు. దీంతో సదరు వ్యక్తి కానిస్టేబుల్ను హెల్మెట్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. ఇది ఆ పోలీస్ కానిస్టేబుల్కు నచ్చలేదు. తనకు సలహా ఇవ్వటం ఏంటని అనుకున్నాడు. కొంతదూరం పోయిన తర్వాత బైకును రోడ్డు పక్కకు ఆపాడు. తన వెనకాల వస్తున్న ఆ వ్యక్తి బైకును అడ్డగించాడు. కోపంగా అతడి దగ్గరకు వచ్చాడు.
పోలీస్, ఆ వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా జరిగింది..
పోలీస్ : నీకేమైనా సమస్యా?
ఆ వ్యక్తి : సమస్యా.. కాదు సార్!
పోలీస్ : మరింత కోపంగా.. ఏయ్.. నీకేమైనా సమస్యా?
ఆ వ్యక్తి : సమస్య ఏం లేదు సార్!
పోలీస్ : ఇంకేంటి?
ఆ వ్యక్తి : హెల్మెట్ పెట్టుకుంటే మంచిదని చెప్పాను.. తప్పితే.. ఏమీ లేదు.
పోలీస్ : నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పో.. నీకెందుకు ఇది!
ఆ వ్యక్తి : సార్! మీ మంచి కోసమే చెప్పా!
పోలీస్: రేయ్.. పోరా!
ఆ వ్యక్తి: సార్ మీ మంచి కోసమే చెబుతున్నా..
పోలీస్: పోరా.. రేయ్! నేను నా గురించి చూసుకుంటాను అని చెప్పాను కదా.. నీకెంటి సమస్య.. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నీకున్నాయా?
ఆ వ్యక్తి : సార్ మీరో పోలీస్ ఆఫీసర్.. మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమని చెప్పటం తప్పా?
పోలీస్ : హెల్మెట్ పెట్టుకోనే పెట్టుకోను.. నీకేంటి సమస్య?
ఆ వ్యక్తి : నేను హెల్మెట్ పెట్టుకోమని మాత్రమే చెప్పాను. అందులో ఏదైనా తప్పుందంటే చెప్పండి.
పోలీస్ : తప్పేరా! పో!
అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలీస్ తీరును తప్పుబడుతున్నారు. పోలీస్లకు మంచి చెప్పినా తప్పే అంటూ మండిపడుతున్నారు.
Helmet போட சொன்னத்திற்கு மிரட்டல் விடுத்த காவலர் ! #Chennai @tnpoliceoffl @chennaipolice_
Cop turns abusive when advised to wear helmet says activist @kavikasi @dt_next #helmet pic.twitter.com/imqpoMWUbH— Raghu VP / ரகு வி பி / രഘു വി പി (@Raghuvp99) October 7, 2022