ఈ రోజుల్లో చదువుకున్న విద్యావంతులు కూడా పద్దతి పాడు లేకుండా చిన్నపిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే గొడవలకు దిగుతూ నలుగురి మందు నవ్వుల పాలవుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు మహిళలు ఓ సీటు కోసం ఏకంగా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని థానే నుంచి పన్వెల్ వైపు కిక్కిరిసిన జనాలతో వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్ వెళ్తుంది.
అయితే ఇదే ట్రన్ లో థానేలో జుబారే ఖాన్ అనే మహిళ తన కూతురితో పాటు తన మనవరాలితో కలిసి ట్రైన్ ఎక్కింది. సీటు లేకపోవడంతో ముగ్గురు అలాగే నిబడ్డారు.అయితే స్నేహ దేవే అనే మరో మహిళ కోపర్ ఖైరానే వద్ద ఇదే ట్రైన్ ట్రైన్ ఎక్కి సీటు దొరకగానే కూర్చుంది. థానే నుంచి నిల్చుని వస్తున్న జుబారే ఖాన్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. తన మనవరాలిని కూర్చోనివ్వకుండా ఇప్పుడే ఎక్కి నువ్వు కూర్చున్నావేంటి అంటూ స్నేహే దేవేతో జుబారే ఖాన్ గొడవకు దిగింది.
ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇదే గొడవ చినిగి చినిగి చివరికి గాలి వానలా తయారైంది. ఇక కోపంతో ఊగిపోయిస్నేహే దేవే, జుబారే ఖాన్ ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. తల్లిని కొడుతుంటే కోపంతో ఊగిపోయిన జుబారే ఖాన్ కూతురు సైతం సీటులో కూర్చున్న మహిళను జుట్టు పట్టుకుని కొట్టింది. ఇక ఈ ఘటనలో వీరిని అడ్డుకోబోయిన పోలీసులకు సైతం గాయాలయ్యాయి. వీరు ఇలా కొట్టుకుంటుండడంతో ట్రైన్ లో ఉన్న మరి కొందరు వారి ఫైటింగ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తల్లి కూతురిపై కేసు నమోదు చేశారు.
मुंबई लोकलमध्ये महिलांची हाणामारी… pic.twitter.com/m8BQHGmBqs
— Datta Lawande (@datta_lawande96) October 6, 2022