పెళ్లి అంటే ఓ సందడి. భాగస్వాములుగా మారిన వారి కన్నా.. ఆ వివాహానికి వచ్చిన బంధు మిత్రులదే అసలు హడావుడి. వధూవరులతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి. కానీ ఈ యువతికి ఏకంగా వరుడికే ఝలక్ ఇచ్చే పని చేసింది.
ఏ బంధాల్లోనైనా ప్రేమలు ఉంటాయి. కాని బామ మరదళ్ల మధ్య సంబంధం మాత్రం కాస్త ఢిపరెంట్. అలకలు, కోపాలు, గిల్లికజ్జాలు, సరసాలు ఇవన్నీ వీరి మధ్య నడుస్తుంటాయి. మేనమామ కొడుకుకు వరసయ్యే వాళ్లే కాకుండా అక్క భర్తగా వచ్చే వారూ కూడా బావ కావడంతో ఏడిపించడమే కాకుండా సరదాగా ఆటపట్టిస్తుంటారు. ఏదైనా పండుగలు, శుభకార్యాలు జరిగే సమయంలో ఎక్కువ హడావుడి మరదళ్లదే ఉంటుంది. ఇక పెళ్లికొడుకు తమ బావే అయితే అంత, ఇంత పరేషాన్ చేయరూ.. ఓ ఆట ఆడేసుకుంటారు. అయితే ఈ మరదలు మాత్రం కొంచెం చిలిపి పని చేసి పెళ్లికుమారుడ్ని ఇరకాటంలో పడేసింది.
విషయంలోకి వెళితే.. ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లి మండపంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు బంధువులంతా వచ్చి వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో యువతి. వధూవరుల మధ్యలో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అంత వరకు ఓకే కానీ.. ఆ మండపంలోనే, బంధువులు ఫోటోలు దిగితుండగానే.. ఆ యువతి పెళ్లి కుమారుడి చేతిని మెల్లిగా తాకింది. ఎవ్వరూ చూడటం లేదని భావించిందో ఏమో.. తాకడం మానలేదు. యువతి చర్యతో విస్తుపోయిన వరుడు సైతం ఆమెనే చూడటం మొదలు పెట్టాడు. అయినప్పటికీ తన చేతిని వెనక్కు తీసుకోవడం కానీ, ఖండించనూ లేదూ. అక్కడి నుండి యువతి కదలకపోవడంతో వధువు సైతం ఆమెను సీరియస్ గా చూసింది.
అయితే ఈ సీన్ మొత్తం వీడియోలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన కామెంట్లు పెడుతున్నారు. పెళ్లింట్లో ఇలాంటివే జరుగుతాయి.. ఇదంతా కామన్ అని యువతికి సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది వరుడ్ని, ఆ అమ్మాయిని తిట్టిపోస్తున్నారు. పక్కనే పెళ్లాన్ని పెట్టుకుని ఆ సరసాలు ఏంటీ రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసిన పనిని కొందరూ హవ్వా అంటూ నోటి మీద వేలు వేసుకుంటున్నారు. మరి కొంత మంది సో ఫన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లిలో ఇలాంటి మరదలు ఒక్కటి ఉంటే చాలు.. ఇక వధూవరులు కొట్టుకు చావాల్సిందే. ఈ ఫన్నీ సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.