పెళ్లి అంటే మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు చూసుంటారు. కానీ, ఓ పెళ్లిలో మాత్రం నోట్ల వర్షం కురిసింది. రూ.పది, రూ.100 కాదు ఏకంగా రూ.500 నోట్ల భవనం పైనుంచి వర్షంలా కురిశాయి. వాటిని ఏరుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు.
సాధారణంగా ఏవైనా వేడుకలు ఉంటే మేళాలు, డాన్సులు, బరాత్ లు అనేవి సహజంగానే ఉంటాయి. అందులోనూ పెళ్లి అంటే మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు సహజంగానే ఉంటాయి. ఇప్పుడు వధూవరులు కూడా పెళ్లిలో డాన్సులు వేయడం కామన్ గా మారిపోయింది. కానీ, పెళ్లి సదర్భంగా నోట్ల వర్షం కురిపించడం మీరు చూశారా? లేదా అయితే ఈ పెళ్లిలో జరిగిన తంతు గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరెరె.. అక్కడ మేము ఎందుకు లేమా? అని ఫీలైపోతారు కూడా. ఎందుకంటే అక్కడ జరిగిన వ్యవహారం అంత సాధారణంగా లేదు మరి. పెళ్లికి వచ్చిన అతిథులపై లక్షల రూపాయలు వర్షంగా కురిపించారు.
మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి అంటే డాన్సులు, బరాత్ లు, విందు ఇవన్నీ కామన్. దాదాపు నార్త్ లో కూడా పెళ్లి అంటే ఇలాంటివే చూస్తుంటాం. కానీ, ఈ పెళ్లిలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. గుజరాత్ లో జరిగిన ఓ వివాహంలో రూ.500 నోట్లు పెళ్లికి వచ్చిన అతిథులపై వెదజల్లారు. కేక్రి పరిధి సెవాడా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నోట్లు విసిరింది మాజీ సర్పంచ్ గా చెబుతున్నారు. మేనల్లుడి పెళ్లి కావడంతో ఆనందంలో ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రూ.5 లక్షలు ఇలా వర్షంలా కురిపించినట్లు తెలుస్తోంది. ఎంత ఆనందం అయినా కూడా ఇలా నోట్లు వెదజల్లుతారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే గుజరాత్ వైపు వాళ్లు మాత్రం ఇది మా దగ్గర సాధారణమే అని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయంటూ గుర్తు చేస్తున్నారు. అలా ఓసారి సింగర్ పై రూ.50 లక్షల నగదు వర్షంగా కురిపించిన సంగతిని గుర్తు చేశారు. ఆనందంగా మేడ పైనుంచి అతిథులపై నోట్లు విసురుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు ఆ డబ్బు ఏదో నిరుపేదలకు దానం చేసినా బాగుండు కదా అని కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ఇలా డబ్బులు వెద జల్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SorosGang भिखारी ए भारत हे तेरे वाहा filmo मे रुपीया उडते हे 🤣🤣🤣
गुजरात मेहसाणा pic.twitter.com/T7lKnK8AnA— akshaypatel (@akshayhspatel) February 18, 2023