పాము అంటే మీకు భయం ఉందా? ఇదేమి పిచ్చి ప్రశ్న? పామంటే భయం లేని వాళ్ళు ఉంటారా? అందరికీ భయమే అని అనకండి. ఎందుకంటే పాము అంటే భయం లేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారంతా పాముల్ని దైర్యంగా పట్టి, బంధిస్తుంటారు. ఇంకొంత మంది వాటిని రక్షించి.., తిరిగి అడవుల్లో వదిలేస్తుంటారు. కానీ.., పాముని ముక్కులో దూర్చి, నోటిలో నుండి బయటకి తీయడం లాంటి విన్యాసం మీరెప్పుడైనా చూశారా? ఇప్పుడు ఓ పెద్దాయన పాముతో ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు.
పాముని ముక్కులో దూర్చి.. నోటి నుంచి బయటకు తీస్తున్నాడు. ఆ పెద్దాయన వయసు దాదాపు 70 ఏళ్ళు పైనే ఉంది. ఆయన ఓ పొడవాటి సన్నని పామును బలవంతంగా ముక్కులోకి దూర్చేశాడు. అది గిలాగిలా కొట్టుకుంటున్నా వదల్లేదు. అలాగే నాసికా రంధ్రాల్లోకి నెట్టాడు. అనంతరం నోటిలోకి చేయి పెట్టి బయటకు తీశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోని బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి ఐ లవ్ మై ఇండియా అని క్యాప్షన్ కూడా జత చేశాడు.
చూడటానికి ఈ వీడియో భయంకరంగా ఉన్నా.., నెటిజన్స్ మాత్రం ఆ పెద్దాయన పనిని ఖండిస్తున్నారు. వినోదం కోసం జంతులను హింసించడం మంచిది కాదని.., ఆ పాముని విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ జమ్వాల్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా.., విష సర్పాలతో ఇలాంటి ఆటలాడడం ప్రాణాలకు మాత్రం ప్రమాదమే. మరి.. మీరు కూడా ఈవీడియోని ఒకసారి చూసేయండి.