Man Asks Ex Girlfriend To Pay After Breakup: ప్రస్తుత కాలంలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం అయిపోయాయి. యుక్త వయసులో కలిగే ఆకర్షణకే ప్రేమ అనే పేరు పెట్టి.. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠథశాల వయసు నుంచే ప్రేమ వ్యహారాలు ప్రారంభించి.. బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను సమాధి చేస్తున్నారు. ఇక నేటి కాలంలో ప్రేమ అనేది కూడా ఆర్థిక వ్యవహారం అయ్యింది. ప్రేమ పేరు చెప్పి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో భారీగా ఖర్చు చేయించడం.. ఆ తర్వాత తీరిగ్గా సారీ చెప్పడం కామన్ అయిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొందరు తమకిదే ప్రాప్తం అనుకుని కామ్‌గా ఉంటారు. మరి కొందరు మాత్రం ఇదిగో ఈ వ్యక్తి లాగా ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధపడతారు. ఇక్కడ ఓ వ్యక్తి బ్రేకప్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్‌కి షాకిచ్చాడు. కలిసి ఉన్నప్పుడు ఆమె కోసం సుమారు 8 లక్షల వరకు ఖర్చు చేశానని.. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ వివరాలు..
ఓ వ్యక్తికి డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ప్రియురాలు ఏం అడిగితే అది కొనిచ్చేవాడు. ఆమె అడిగినంత డబ్బు కూడా ఇచ్చాడు. ఆఖరికి ఆమె తల్లి ఆస్పత్రిలో ఉంటే వైద్యానికి అవసరమైన డబ్బు సర్దుబాటు చేశాడు. కానీ దురదృష్టం కొద్ది ఆమె మృతి చెందింది. ఇలాంటి సమయంలో ప్రియురాలికి తోడుగా ఉండటమే కాక.. అంత్యక్రియలు కూడా తానే నిర్వహించాడు.
ఇది కూడా చదవండి: Bihar: పెళ్లికొడుకు చెంప పగలకొట్టిన మరదలు.. అసలు ఏం జరిగిందంటే!
వీరి బంధం ఇలా సాగుతుండగా.. ఓ రోజు హఠాత్తుగా ఆ అమ్మాయి అతడికి బ్రేకప్ చెప్పింది. అరే ఇంతలా ప్రేమిస్తే.. చివరకు ఇలా చేసింది అని బాధ పడ్డాడు. అయితే అందరిలా అతడు దేవదాసులా మారిపోలేదు. తన గర్ల్‌ఫ్రెండ్ పరిచయం అయిన దగ్గర నుంచి ఆమెకు ఎంత ఖర్చు చేశాడో.. వివరంగా లెక్క రాసి పెట్టాడు. ఇలా మొత్తం 100 బిల్లలు కలిపి మొత్తం 72వేల యువాన్స్ అంటే మన ఇండిన్ కరెన్సీలో 8.41 లక్షల రూపాయగా తేలింది. సదరు వ్యక్తి దీనిలో కొంత కన్సెషన్ ఇచ్చి.. 7 లక్షలు చెల్లించాలని సూచించాడు. ఈ వార్త తెలిసిన నెటిజనులు మంచి పని చేశావ్.. ప్రేమ పేరుతో వాడుకునే వారికి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన పద్దతి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వామ్మో.. ఈ మేక చెవులు చూస్తే ఆశ్చర్యపోతారు.. !