మలైకా అరోరా.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో కూడా ఆమె సుపరిచితమే. చల్ చయ్యా చయ్యా చయ్యా అంటూ దిల్ సేలో షారూఖ్ ఖాన్ తో ఆడి పాడి.. ఇక్కడి కుర్ర హృదయాలను సైతం కొల్లగొట్టారు. తెలుగులో తొలిసారిగా మహేష్ బాబు అతిధి సినిమాలో ప్రత్యేక సాంగ్ చేసిన మలైకా.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ కాక పుట్టించారు. సినిమాలతోనే కాదూ వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె పెను సంచలనమే.
బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను 1998 లో ఆమె వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా 2016లోనే విడిపోతున్నామని ప్రకటించిన ఈ జంట.. 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు అర్షాన్ ఖాన్. కాగా, విడాకుల తర్వాత మలైకా.. ఆమె తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తన మాజీ భర్తను కలిశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె ఏ సందర్భంలో తన మాజీ భర్తను కలిశారంటే.. వీరి కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి సెండాఫ్ ఇచ్చేందుకు ముంబయి విమానాశ్రయానికి వచ్చారు. అతడికి సెండాఫ్ ఇచ్చిన అనంతరం.. బయటకు వచ్చిన ఇద్దరూ.. ఒకరి నొకరు ఆత్మీయంగా హత్తుకుని ఎవరీ దారిన వారూ వెళ్లిపోయారు. వార్తా చాన్నళ్లు ఊరుకోవు కదా.. ఈ సీన్ మొత్తాన్ని క్లిక్ మనిపించాయి. ఇటీవల సెలబ్రిటీ జంటలు విడిపోయినా.. తమ పిల్లల కోసం స్నేహితులుగా మారుతున్న సంగతి తెలిసిందే. పిల్లల కోసం విడిపోయిన సెలబ్రిటీలు స్నేహితులుగా మారడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 27, 2023