భవనంపై నుంచి అదుపు తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కొందరు భవనంపై పని చేసుకుంటుండగా, మరికొందరు ఫోన్ లో మాట్లాడుతూ పరధ్యానంలో భవనంపై నుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. అయితే కొందరికి మాత్రం భూమిపై బ్రతికే రాత ఉండి.. అలా భవనంపై నుంచి పడిన సందర్భంలో కింద నుంచి కొందరు గమనించి ఎంతో చాకచక్యంగా కాపాడి వారి ప్రాణాలను నిలబెడతుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడిపోయిన తమ్ముడిని హీరోలా వెళ్లి అన్న కాపాడాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని మలప్పురం జిల్లాలోని ఉదలూర్ గ్రామంలో షఫిక్, షాజీద్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరు ఇంటిని శుభ్రం చేసేందుకు సిద్దమయ్యారు. షఫిక్ ఇంటి మొదటి ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమం షఫిక్ పట్టు తప్పి.. మిద్దె మీద నుంచి పడిపోయాడు. అది గమనించిన అన్న షాజీద్ తమ్ముడిని చాకచక్యంగా పట్టుకుని కాపాడినాడు. ఈఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. తమ్ముడిని రక్షించిన అన్న మాత్రం కొద్ది సమయం చిన్నపాటి నొప్పులతో ఇబ్బంది పడ్డాడు. ఈ సీసీటీవీ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: ఈసారి పేదల కోసం ఫ్రీ 5స్టార్ హోటల్ ఓపెన్ చేసిన హర్షసాయి!
ఇదీ చదవండి: వైరల్ వీడియో: 400 అడుగుల ఎత్తులో.. గాల్లో పెళ్లి చేసుకున్న జంట!