పాములు అనగానే అందరికీ భయమే. కొందరైతే పాముని చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. కానీ.., మహాశివరాత్రి పర్వదినం నాడు ఒకేసారి మూడు నాగుపాములు జనావాసాల్లోకి వచ్చేస్తే..! మనుషులకు హాని కలిగించాల్సిన ఆ పాములు, ఏకంగా ఆశీర్వాదం అందిస్తే..! అది శివయ్య లీల అనుకోకుండా ఉండగలమా? మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మహాశివరాత్రి నాడు అంతా భక్తి పారవశ్యంతో ఉండగా.. హరిసల్ గ్రామస్థులకు ఒక భయానక దృశ్యం కనిపించింది. మూడు నల్ల త్రాచులు ఒకే చెట్టుకు పెనేసుకుని ప్రజలకు కనిపించాయట. మాములుగా అలాంటి స్థితిలో పాములు గనుక మనుషులను చూస్తే కచ్చితంగా పడగ విప్పి వెంట పడతాయి. కానీ.., ఇక్కడ అలా జరగలేదట. ఆ మూడు నల్ల త్రాచులను జనాలు చుట్టు ముట్టగానే.. అవి పడగ విప్పి ప్రజల వైపు చూసి ఆశీర్వాదం అందించాయట. తరువాత ఆ పాములు అడవి బాట పట్టినట్టు తెలుస్తోంది.
మహా శివరాత్రి కావడం, దర్శనమిచ్చి, ఆశీర్వదించిన నాగులు అత్యంత అరుదైనవి కావడంతో హరిసల్ గ్రామస్థుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. “ఇది సాధారణ దృశ్యం కాదు. మహా శివరాత్రి నాడు జరిగిన ఆ పరమ శివుడి మహిమే. ఎందుకంటే ఒక్క నల్ల త్రాచు కనపడటమే అరుదు. అలాంటిది మూడు ఒకే చోట కనిపించి, ఆశీర్వాదం ఇవ్వడం ఆ శివయ్య మహిమే” అని గ్రామస్థుల నమ్మకం. అయితే…, ఈ ఘటన జరిగిందా? లేదా? అన్న విషయంలో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ఇది శివయ్య లీలగా మీకు భావిస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.