ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్‌లో మునిగి తేలుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలకు సైతం ఫోన్లకు అలవాటు పడ్డారు. అన్నం తినాలన్నా, మారాం చేస్తున్నా ఫోన్లు ఇచ్చేయాల్సిందే. యువత అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. ఆ తర్వాత చదువులను, కెరీర్‌లను అటకమీద పెట్టేస్తున్నారు. ఫోను లాక్కున్నాడని..
ఈ రోజుల్లో ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం. గతంలో పెద్దవాళ్లు, పిల్లలు ఒక చోట చేరి టీవీని చూసేవారు. కానీ ఇప్పుడు మనిషికో ఫోన్ వచ్చేయడంతో తీరిక దొరికిన సమయాల్లో కూడా చరవాణిని పట్టుకుని కూర్చుంటున్నారు. మాటలు కొరవడ్డాయి. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్‌లో మునిగి తేలుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలు సైతం ఫోన్లకు అలవాటు పడ్డారు. అన్నం తినాలన్నా, మారాం చేస్తున్నా ఫోన్లు ఇచ్చేయాల్సిందే. యువత అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. కొన్నాక చదువులను, కెరీర్‌లను అటకమీద పెట్టేస్తున్నారు. అటు కాలేజీల్లో కూడా తరగతులు జరుగుతున్న సమయంలో ఫోన్లు పట్టుకుని క్లాస్ మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తుంటారు.
అలా క్లాస్ రూమ్‌లో ఫోన్ వాడిందని విద్యార్థిని ఫోన్ తీసుకున్నాడు టీచర్. దీంతో అతడిపైనే దాడి చేసింది విద్యార్థిని . ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో టెన్నిస్సిలోని నాష్‌విల్లేలో ఉన్న ఆంటియాక్ హై స్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని క్లాసు రూములో ఫోను వాడుతుండటాన్ని చూసిన టీచర్.. దాన్ని లాక్కున్నాడు. అనంతరం అతడు ఫోన్ తీసుకుని..బయటకు వెళుతుండగా.. టీచర్‌ను వెంబడించింది విద్యార్థిని. తన ఫోన్ తనకు ఇచ్చేయాలంటూ టీచర్ ను పలుమార్లు అడిగింది. ఇవ్వకపోవడం కోపంతో తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రేను అతడిపై చల్లింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పెప్పర్ స్ప్రే చల్లడంతో టీచర్ అరవడం కనిపిస్తుంది. స్కూల్ వర్క్‌ను గూగుల్‌లో సెర్చ్ చేసి.. ఫోన్ ద్వారా టెక్ట్స్ చేస్తూ సమాధానం ఇస్తున్నట్లు టీచర్ ఆరోపించాడు.
Girl pepper sprays teacher because he took her phone pic.twitter.com/QPAz6c3l4G
— OnlyBangers.eth (@OnlyBangersEth) May 6, 2023