వాలెంటైన్స్ సందర్బంగా ప్రేమికులు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం సర్వసాధారణం ఆ రోజు కచ్చితంగా కలిసుకోవాలని అనుకుంటూ ఉంటారు. డిన్నర్, డేట్ ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ప్రేమ జంటలు ప్రేమికుల రోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటాయి. ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు ప్రేమ జంటల సంతోషానికి హద్దులు లేకుండా పోతుంది. తమకిష్టమైన వారితో కలిసి తిరగటానికి, కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి చూస్తుంటారు. డిన్నర్, డేట్ అంటూ రెస్టారెంట్‌లు, హోటళ్లకు వెళుతూ ఉంటారు. ఇవేవీ కాకపోయిన ఏదో ఒక చోట కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇదే కొన్ని సార్లు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా, ప్రేమికుల రోజున మేడపై కలుసుకున్న ఓ ప్రేమ జంట చిక్కుల్లో పడింది. యువతి తల్లి తన కూతురి ప్రియుడ్ని, కూతుర్ని చితక బాదింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఓ ప్రేమ జంట.. యువతి ఇంటి మేడపై కలుసుకున్నారు. ప్రేమికుల రోజు కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మేడపైకి వెళ్లిన కూతురు ఎంత సేపటికి కిందకు రాకపోవటంతో తల్లికి అనుమానం వచ్చింది. కూతుర్ని వెతుక్కుంటూ మేడపైకి వెళ్లింది. తాను పైకి రావటం చూసి.. ఓ యువకుడు దాక్కోవటం ఆమె గమనించింది. పైకి వెళ్లిన తర్వాత కూతుర్ని చెడామడా తిట్టింది. అక్కడే దాక్కున్న యువకుడ్ని పట్టుకుంది. అతడ్ని బాగా కొట్టింది. తర్వాత తన కాలి చెప్పుతో రెండు దెబ్బలు వేసింది.
అయితే, అతడు ఆమెనుంచి తప్పించుకుని అక్కడినుంచి పరుగులు పెట్టాడు. ఆమె అతడ్ని పట్టుకోవటానికి ప్రయత్నించింది. కానీ, అతడు వాయువేగంతో పరుగులు పెట్టాడు. అయినా పట్టుకోలేకపోయింది. తర్వాత తన కూతురి వైపు వచ్చింది. కూతుర్ని బూతులు తిట్టింది. చెప్పుతో కూడా కొట్టింది. ఇక, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. ఘర్ కే కాలేశ్ అనే ట్విటర్ ఖాతాదారుడు ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఫిబ్రవరి 14న విడుదల చేశాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kalesh B/w Girl,Her Boyfriend vs her mom on Valentine’s daypic.twitter.com/avEY8O9ErA
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2023