రైతే రాజు.. రైతే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిందే. కానీ, ఆ రైతు మాత్రం నిత్యం ప్రకృతితో పోరాడుతూ ఉంటాడు. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి కన్నెరజేస్తే మిగిలేది కన్నీళ్లే. అకాల వర్షాలతో ఏటా ఆ రైతు వెన్ను విరుగుతూనే ఉంది. అయితే కొందరు రైతులు మాత్రం ప్రకృతి వల్ల కలిగే నష్టాలను ముందే గ్రహించి.. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుని పంటను కాపాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పలు రకాల ధాన్యాలే కాకుండా వాణిజ్య పంటలను కూడా పండిస్తుంటారు. వాణిజ్య పంటల వల్ల ఏక్కువ ఆదాయం రావడమే అందుకు కారణం. కానీ, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ లాభాలే కాదు.. పెట్టుబడి, కష్టాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఇప్పుడు చెప్పుకోబోయే చెర్రీ సాగు. అసలు చెర్రీ సాగు చేయాలంటే రైతులు ఎందుకు అన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసుకుందాం.
చెర్రీలు అందరికీ ఇష్టమే కేకుల్లో గార్నిష్ కోసం మాత్రమే కాకుండా.. చాలా రకాల పదార్థాల్లో వాడుతుంటారు. వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ చెర్రీ సాగు అంత సులువైనది కాదు, ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది. చెర్రీలను సాధారణంగా మెట్ట భూముల్లో సాగు చేస్తుంటారు. ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం లేదనమాట. చాలా కొద్ది మొత్తం నీటితోనే ఈ పంటను పండించవచ్చు. అయితే అధిక నీరు, వర్షం వల్ల ఈ పంటకు ఎంతో నష్టం చేకూరుతుంది. చెర్రీ కాయపై నీరు పడితే దానిని వెంటనే పీల్చేసుకుంటుంది. అలా పీల్చుకోవడం వల్ల ఆ చెర్రీ కాయలు ఉబ్బిపోతుంటాయి. కాయ పెరగాల్సిన సమయం కంటే ముందే ఉబ్బిపోతే పైన తోలు సాగక పగిలిపోతుంటాయి. అంతేకాకుండా ఆ కాయలు జ్యూస్ కోసం తప్ప మరెందుకూ పనికి రావు.
ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డు మీద జుట్టు పట్టుకుని కొట్టుకున్న గర్ల్ స్టూడెంట్స్!అందుకే చెర్రీ సాగుచేసే రైతులు ఓ వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నారు. అదేంటంటే… వర్షం పడిన వెంటనే హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంటారు. వర్షం ఆగిపోయిన తర్వాత వెంటనే హెలికాప్టర్లను గాల్లోకి లేపి పంటపై తిప్పుతుంటారు. అలా చేయడం వల్ల హెలికాప్టర్ గాలికి చెర్రీ చెట్లపై ఉన్న నీరు ఆవిరైపోవడం, కారిపోవడం జరుగుతుంది. అందువల్ల చెర్రీ కాయలు పాడు కాకుండా నాణ్యంగా ఉంటాయి. చెర్రీ పండ్లను అంత కష్టపడి పండించబట్టే వాటికి అంత డిమాండ్, రేటు అనమాట. రైతులు చేస్తున్న ఈ పద్ధతిని చూసి చాలా మంది కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలో హీరోయిన్ కి ఉక్కపోస్తోందని రాకీభాయ్ హెలికాప్టర్ తిప్పిన సీన్ గుర్తుచేసుకుని ఆ వీడియో వైరల్ చేస్తున్నారు. చెర్రీ పంటకు హెలికాప్టర్లు వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.