Viral Video: ఈ మధ్య కాలంలో బైక్ తుంటరులు ఎక్కువయి పోయారు. పేరుకోసం.. ఫేమ్ కోసం బైకుపై స్టంట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించటానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిక్కుల్లో సైతం పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ యువకుడు బైకుపై స్టంట్ చేసి ఇబ్బందుల పాలయ్యాడు. అతడికి పోలీసులు చుక్కలు చూపించారు. ఇకపై అలా చేయకుండా భారీ ఫైన్ వేయటంతో పాటు గుంజీలు తీయించారు. ఈ సంఘటన ఛత్తీష్ఘర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీష్ఘర్లోని దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం బైకుపై ఓ స్టంట్ చేశాడు. ఓ వైపు తిరిగి కూర్చుని బైకు నడిపాడు. దాదాపు ఓ కిలోమీటర్ వరకు బైకును అలా నడిపించాడు.
రోడ్డుపై ట్రాఫిక్ ఉన్నా కూడా స్టంట్ ఆపలేదు. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. పక్కనే వెళుతున్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీడియో కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోపై దుర్గ్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యారు. అతడిని వెతికి పట్టుకుని తగిన శిక్ష విధించారు. 4200 రూపాయల ఫైన్ వేయటంతో పాటు గుంజీలు తీయించారు. ఆ తర్వాత ఆ యువకుడి స్టంట్ వీడియోకు ఫైన్, గుంజీల వీడియోను జత చేశారు. తమ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇకపై అలా పిచ్చి పిచ్చి స్టంట్లు చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించటానికి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
▪️स्टंटबाज, मोडिफाइड साइलेंसर, रैश ड्राइविंग करने वालों के विरुद्ध लगातार दुर्ग पुलिस के द्वारा कार्यवाही की जा रही है।
▪️ कृपया यातायात के नियमों का पालन करें।
▪️यातायात पुलिस व्हाट्सएप हेल्पलाइन नंबर 94791-92029।@SadakSuraksha#trafficpolicedurg #Durgpolice pic.twitter.com/5KBTs0ED2R
— Durg Police (@PoliceDurg) September 24, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: నైట్ క్లబ్ వద్ద రచ్చ…యువతులపై క్లబ్ బౌన్సర్ల ఆరాచకం!