బౌన్సర్లు ఓ నైట్ క్లబ్ వద్ద హల్చల్ చేశారు. పబ్‌కు వచ్చిన యువతులతో అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అసభ్యకరంగా తాకడంతో ఇదేంటని అడిగిన పాపానికి బాధితులను బౌన్సర్లు చితకబాదారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువత స్నేహితుడి పార్టీకని స్థానికంగా ఉండే ఓ క్లబ్ కి వెళ్లారు. కాగా, వారు క్లబ్‌లోని ప్రవేశిస్తున్న క్రమంలో ఓ బౌన్సర్ యువతితో అనుచితంగా ప్రవర్తించి.. తాకరాని చోట చేతి తగిలించాడని ఆరోణపణలు వినిపించాయి. ఈ విషయం ఆమె.. తన సహచరులకు చెప్పడంతో వారు.. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ఒకరినొకరు నెట్టుకోవడం వరకు జరిగింది.
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కొందరు యువతి యువకులు పార్టీ చేసుకోవడం కోసం ఓ నైట్ క్లబ్ కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న కొందరు బౌన్సర్లు అమ్మాయిల పట్ల దుర్భాషలాడుతూ వారిపై భౌతిదాడికి దిగారు. అంతే కాకుండా ఓ యువతిని అసభ్యంగా తాకుతూ.. దుస్తులు చించేశారు. దీంతో సదరు యువతి స్నేహితులు ఇదేంటని ప్రశ్నంచారు. వారిపైన కూడా బౌన్సర్లు దాడికి దిగి..విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో ఈ ఘటనపై యువతి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. తన దుస్తువులు చించుతూ, దుర్భాషలాడుతూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత యువతి పోలీసుల ముందు వాపోయింది. దీంతో పోలీసులు బాధితురాలి స్టేట్ మెంట్ ను ఫైల్ చేశారు. ఘటనపై పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
క్లబ్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. అయితే మరొకవైపు యువతి, యువకుల తల్లిదండ్రులు క్లబ్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బౌన్సర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే గతంలోనూ క్లబ్ లకు వచ్చిన యువతపై బౌన్సర్లు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.