Viral Video: తనతో గొడవ పడి పుట్టింటికి పోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ భర్త పిచ్చి పని చేశాడు. సెల్ ఫోన్ టవర్ ఎక్కి, తన భార్య ఇంటికి తిరిగి రావాలంటూ హల్ చల్ చేశాడు. భార్య ఇంటికి రాకపోతే దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బదన్పూర్ తెహ్సిల్, బద్హాది గ్రామానికి చెందిన జనపత్ బకల్ కొద్దిరోజుల క్రితం తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అతడు ఎంత బతిమాలినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బుధవారం ఫుల్లుగా మందు తాగాడు.
అసలే కోతి.. పైగా కల్లు తాగిందన్నట్లు.. అతడికో పిచ్చి ఆలోచన వచ్చింది. వెంటనే ఊరి బయట ఉన్న సెల్ఫోన్ టవర్ ఎక్కాడు. అది గమనించిన గ్రామస్తులు టవర్ దగ్గరకు చేరుకున్నారు. అతడ్ని కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘నా భార్య ఇంటికి రావాలి. లేదంటే కిందకు దూకుతా!’ అని మొండిపట్టు పట్టుకున్నాడు. వారు ఎంత బతిమాలినా అతడు కిందకు దిగలేదు. దీంతో గ్రామస్తులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక, పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అతడ్ని కిందకు దింపటానికి వారు కూడా తమ శాయశక్తులా ప్రయత్నించారు. ‘నా భార్య ఇంటికి రావాలి. లేదంటే కిందకు దూకుతా!’ అని వారితో కూడా చెప్పాడు. గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి అతడి భార్యకు నచ్చజెప్పి తీసుకొస్తామని మాట ఇచ్చారు. వారు మాట ఇచ్చిన తర్వాతే జనపత్ కిందకు దిగివచ్చాడు. అతడు కిందకు దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ పిచ్చిపని చేశాడని ధ్రువీకరించుకున్న తర్వాత వదిలేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
जालना: माहेरी गेलेल्या बायकोला परत आणण्याच्या मागणीसाठी दारूच्या नशेत तरूणाचा ४ तास मोबाईल टॉवरवर ठिय्या.https://t.co/CbvSFUjpi9 pic.twitter.com/tNvzgVZUC7
— Lokmat (@lokmat) July 21, 2022
ఇవి కూడా చదవండి : Viral Video: వైరల్ వీడియో: కేంద్ర మంత్రిని ఆశ్చర్యపర్చిన మొక్కజొన్న కంకి రేటు..