టివి సీరియల్స్ చూడని ఇళ్లు అంటూ ఉండదు. ముఖ్యంగా మహిళలు. వీటికి పెద్ద అభిమానులు. అవి ఒక్క రోజు మిస్సైనా, పక్కింటి వారికో, పొరిగింటి వారినో అడిగి తెలుసుకుంటారు. దీనిపై టాపిక్ తేవాలే కానీ రోజులు కూర్చున్నా చర్చించుకుంటారు. ఈ టివి సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకుంటున్న ధారావాహిక గుప్పెడంత మనసు. ఇందులో ఓ ముఖ్య పాత్రధారి ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నారని సమాచారం.
సినిమా తర్వాత ఎంటర్‌టైన్ మెంట్ చేసేవి సీరియళ్లు. మహిళలు సినిమాలకైనా రారేమో కానీ, సీరియళ్లు చూడకుండా ఉండలేరు. ఇక ఆ సీరియల్ నచ్చిందంటే.. ఏళ్ల తరబడైనా చూస్తారు. సీరియల్స్ లోని నటీనటులను తమ ఇంట్లో మనుషుల్లా ఫీలై.. వాళ్లకేమీ జరిగినా వీరు కన్నీరు కారుస్తారు. వీరికి నచ్చిందంటే చాలు ఇంటిల్లి పాదీ చూడాల్సిందే. ఇటీవల కాలంలో అలా మంచి పేరు తెచ్చుకున్న సీరియల్స్ లో ముందు వరుసలో ఉంటాయి కార్తీక దీపం, గుప్పెడంత మనసు. కార్తీక దీపానికి ఎండ్ కార్డు పడగా.. ఇప్పుడు గుప్పెడంత మనసు హవా నడుస్తోంది. ఇటీవల ఈ సీరియల్ చాలా బాగుందని ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కూడా మెచ్చుకున్నారంటే.. చూడండి. ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అది మరీ.
ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులకొక చేదు వార్త. ఏంటీ ఈ సీరియల్ కూడా ముగించేస్తున్నారేమో అనుకుంటున్నారా కాదండి. 2020లో ప్రారంభమైన ఈ సీరియల్ సుమారు సంవత్సరం కాలం నుండి అలరిస్తూ వస్తోంది. రిషి-వసుధారల ప్రేమకథా పలు మలుపులు తీసుకుంటుంది. ఇందులో రిషిగా ముఖేష్ గౌడ, వసుధార రక్షా గౌడ తమదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. వీరితో పాటు మహేంద్ర పాత్రలో సీనియర్ నటులు సాయి కిరణ్, హీరోయిన్ తండ్రి పాత్ర చక్రపాణి క్యారెక్టర్ లో బాలాజీ నటిస్తున్నారు. వీరితో పాటు హీరో పెద్దమ్మ దేవయాని క్యారెక్టర్ లో నటిస్తున్నారు మిర్చి మాధవి. తనదైన విలనీజం పండిస్తూ.. ఆమె తప్ప ఈ పాత్రను ఎవ్వరూ పోషించలేరన్నట్లు పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆమె ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నారు. అయితే మాధవి ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి కారణాలు..ఆమె యుకెకు వెళ్లిపోతున్నారట. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ కూడా ఇటీవల షూట్ చేశారట. ఆ సమయంలో సీరియల్ఈ టీం ఆమెకు సెండాఫ్ పార్టీ సెలబ్రేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. భారతీ అనే సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. మిర్చిలో ఓ పాత్రలో నటించారు. అప్పటి నుండే ఆమెకు మిర్చి మాధవి అన్నపేరు వచ్చింది. ఆ తర్వాత రెడ్డి గారింట్లో శతమానం భవతి, డీజే, రౌడీయిజం, పలాస, శశి వంటి సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో నటించారు. మిర్చి మాధవి సినిమాలు, సీరియల్స్ లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.