‘కమెడియన్ హరి’ పటాస్ షో తెలిసిన వాళ్లకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం కామెడి స్టార్స్ షో, ఇంకా కొన్ని వెబ్ సిరీస్‌తో ఫుల్ బిజీగా మారిన హరి ఏడ్చేశాడు. ఎక్కడో కాదు, కామెడీ స్టార్స్ స్టేజ్ పైనే చిన్న పిల్లాడిలా కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. అసలు ప్రేమ మాయలో ఎందుకు పడ్డావు హరి నువ్వు అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ‘ ఈ ప్రేమనేది మన చేతుల్లో ఉండదు. ఒక మనిషిని ఎందుకంత లవ్ చేస్తామో, ఎందుకు అంత మిస్ అవుతామో మనకే తెలీదు’ అంటూ కమెడియన్ హరి ఏడ్చేశాడు.
‘నేను లవ్ ఫెయిల్యూర్, వాళ్లు నన్ను ఎందుకు వదిలేసి వెళ్లారో నాకు తెలుసు, అవి నాలోనే దాచుకున్నాను’ అన్నాడు హరి. ఇక, హరి అషూరెడ్డి పేరు టాటూ వేయించుకోవడం, అషూకి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. అది బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు మరో ప్రేమ జంట దొరికింది. సుడిగాలి సుధీర్ – రష్మీ, వర్ష – ఇమ్మాన్యుయేల్ జంటల తర్వాత ఇప్పుడు హరి – అషూరెడ్డిల జంట కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.