దీపికా పిల్లి టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయ్యి… ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న దీపికా పిల్లి.. వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి ఏకంగా.. బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. నిజానికి సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. మరి, సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్ దీపికా పిల్లి కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్, డైలీ యాక్టివిటీస్ గురించి పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా కామెడీ స్టార్స్ కు చేసిన ఎంట్రీ సాంగ్ మొత్తాన్ని వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా.. యాక్షన్ చెప్పిన దగ్గర నుంచి కట్ చెప్పే వరకు దీపిక డాన్స్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వంగపూత రంగు బొట్టి గౌనులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ సినిమాలోని విజయ్ సేతుపతి, సమంత, నయనతారల టూటూ సాంగ్ కు దీపిక చేసిన డాన్స్ చూసి ఫ్యాన్స్.. ఐ లవ్ యూ టూ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీపికా పిల్లి పోస్ట్ చేసిన ఈ హాట్ డాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.