కిరాక్ ఆర్పీ.. బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా తన నటన, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కిరాక్ ఆర్పీ కామెడీకి మాత్రమే కాదు.. తన వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఆర్పీ చాలాకాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోకి దూరమైన ఆర్పీ.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కామెడీ స్టార్స్ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో జేడీ చక్రవర్తితో MMOF, సప్తగిరితో వజ్ర కవచదర గోవిందా, ఇదేం దెయ్యం వంటి సినిమాల్లో నటించాడు.
ఇటీవలే కిరాక్ ఆర్పీకి అతను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. పెద్దలను ఒప్పించి తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్న అనే నెల్లూరు జిల్లాకు చెందిన అమ్మాయితో కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆర్పీ- లక్ష్మీ ప్రసన్న నిశ్చితార్థ వేడుకగా అట్టహాసంగా జరిగింది.
ఆర్పీ- లక్ష్మీప్రసన్న ఎంగేజ్మెంట్ కి బంధుమిత్రులే కాదు.. నాగబాబు, నిహారిక, ఓంకార్, శివాజీ, అన్నపూర్ణ, హేమ, కృష్ణభగవాన్, ధన్ రాజ్, హైపర్ ఆది, రాంప్రసాద్, దొరబాబు వంటి సెలబ్రిటీలు హాజరయ్యి పెళ్లిపీటలెక్కనున్న నవ దంపతులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలు ఎవరు ఈ లక్ష్మీప్రసన్న అని కూడా వెతుకుతున్న వారు లేకపోలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో సెటిల్ అయ్యి.. ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లక్ష్మీప్రసన్న సపోర్ట్ తోనే నిలదొక్కుకున్నట్లు స్వయంగా ఆర్పీనే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలా వారి మధ్య స్నేహం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది.
ఆర్పీ వ్యక్తిత్వం, అమాయకత్వం, మంచితనం చూసి ప్రేమలో పడిపోయినట్లు లక్ష్మీప్రసన్న సైతం తన ఇన్ స్టాగ్రామ్ పోస్టుల్లో కోట్స్ పెడుతూ ఉండేది. కొన్నాళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎంతో పొదుపుగా చెప్పుకొచ్చే ఆర్పీ.. ఒక్కసారిగా హోమ్ టూర్ వీడియోలో లక్ష్మీ ప్రసన్నను పరిచయం చేసి అందరికీ షాకిచ్చాడనే చెప్పాలి.
అయితే వారి ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికి రెండు వారాలు దాటిపోయినా కూడా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైరల్ వీడియోలో కిరాక్ ఆర్పీ- తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్నకు ముద్దు పెడుతూ ఫొటోకి ఫోజిస్తున్నాడు. అంతేకాకుండా ఆమె భుజంపై చేయి వేసి తన సిగ్నేచర్ స్టెప్ ని కూడా వేసి ఫొటోలు దిగారు.
— K I N G (@KingKalyanPK) June 8, 2022
కిరాక్ ఆర్పీకి సంబంధించన ఫొటోలు, వీడియోలు వారి అధికారిక ఖాతాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. అక్కడికి వచ్చిన చాలా మంది సెలబ్రిటీల్లో పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ ఉండటంతో కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ కాస్తా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఈ వైరల్ వీడియోలు, ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.