తెలుగు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న కామెడీ షోలలో ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ షోలో మెగాబ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉండగా.. టిక్ టాక్, ఢీ ఫేమ్ దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే.. జబర్దస్త్ వీడిన తర్వాత నాగబాబు జడ్జిగా ప్రారంభమైన ఈ షోలో.. జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ గా, టీమ్ సభ్యులుగా పాల్గొన్న వారంతా ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఈ ప్రోమోలో ముక్కు అవినాష్ తో పాటు ధనరాజ్, యాదమ్మ రాజు ఇలా అందరూ వారి వారి స్కిట్స్ తో నవ్వించినప్పటికీ.. ఈ వారం అన్నింట్లోకి చమ్మక్ చంద్ర స్కిట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఎందుకంటే.. చమ్మక్ చంద్ర స్కిట్ లో కొత్తగా చేరిన బ్యూటీని చూసి అందరూ మనసు పారేసుకుంటున్నారు. ఆ బ్యూటీ ఎవరో కాదు.. డైరెక్టర్ బాలా తెరకెక్కించిన నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాతో పాటు తలైవా సూపర్ స్టార్ రజిని సినిమాలో కూడా మెరిసి మంచి గుర్తింపు దక్కించుకుంది.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే.. సాయి ధన్సిక. సూపర్ స్టార్ రజినికి కూతురిగా ‘కబాలి’ సినిమాలో నటించిన ధన్సిక.. బాలా తెరకెక్కించిన ‘పరదేశి’ సినిమాలో అద్భుతమైన రోల్ చేసింది. దాదాపు 12 ఏళ్లకు పైగా తమిళ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ధన్సిక.. ఈ ఏడాది షికారు అనే సినిమాతో తెలుగులో డెబ్యూ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ‘కామెడీ స్టార్స్ ధమాకా’లో చమ్మక్ చంద్ర స్కిట్ లో దర్శనమిచ్చి సర్ప్రైజ్ చేసింది.
జనరల్ గా చమ్మక్ చంద్ర స్కిట్స్ సంగతి అందరికి తెలిసిందే. భార్యభర్తలు.. భర్త బయటికి వెళ్ళగానే పక్కింటివాడు వచ్చి ఈవిడకు సైట్ కొట్టడం, ఫ్లర్ట్ చేయడం.. ఇప్పుడు ధన్సిక కనిపించిన స్కిట్ లో కూడా అదే రిపీట్ అయ్యింది. ధన్సిక భర్త పోలీస్.. డ్యూటీ మీద బయటికి వెళ్ళగానే పక్కింట్లో ఉండే చమ్మక్ చంద్ర ఆమెతో ఫ్లర్ట్ చేస్తాడు. ఇదే స్కిట్. అయితే.. ఈ స్కిట్ లో ధన్సికకు తెలుగు రాకపోయినా స్వయంగా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకుంది. కబాలి లాంటి సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. తెలుగు కామెడీ స్టార్స్ ధమాకాలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ధన్సిక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.