ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమ జంటలు బరితెగిస్తున్నాయి. మితి మీరిన స్వేచ్చ, స్వాతంత్రాలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. నడి రోడ్లపై కూడా ఒళ్లు మర్చిపోయి అశ్లీల చేష్టలకు తెరతీస్తున్నారు. తాజాగా, ఓ ప్రేమ జంట దొంగిలించిన బైకుపై రచ్చ రచ్చ చేసింది. నడి రోడ్డుపై కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. చివరకు చేసిన తప్పుకు జైలు పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఛత్తీష్‌ఘర్‌లోని దుర్గ్ ప్రాంతంలోని రోడ్డుపై ఓ ప్రేమ జంట బైకుపై ప్రయాణిస్తోంది. యువకుడు బైకు నడుపుతూ ఉంటే.. అతడికి ఎదురుగా.. మీద ప్రియురాలు కూర్చుని ఉంది. స్పీడుగా వెళుతున్న బైకుపై కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ జంట రచ్చ చేసింది. రోడ్డుపై వెళుతున్న కొంతమంది దీన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన వీడియో ఛత్తీష్‌ఘర్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకోమని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. యువతీ, యువకుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. వారు వికృత చేష్టలకు పాల్పడిన బైకు వారిది కాదని తేలింది. ఎవరో దొంగిలించిన బైకును ఆ యువకుడు 9 వేల రూపాయలకు కొన్నాడని తెలిసింది. ఆ బైకు ధర మార్కెట్‌లో 1.50 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. యువకుడి వద్ద బండికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లు కూడా లేవని గుర్తించారు. బైకును సీజ్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
भिलाई : चलती बाइक पर कपल का रोमांस pic.twitter.com/G6WNu5lJ0K
— Anoop mishra rahul (@rahulmi50606036) January 21, 2023