సోషల్ మీడియా లో ఎప్పుడు ఏ వార్త వైరలవుతుందో ఎవరు ఊహించలేం. దీని మూలాన.. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ప్రతీది సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే.. వివాహా వేడకలకు సంబంధించిన పలు విషయాలు పలు విషయాలు వైరలవ్వడం మానం చూశాం. ఒకరికొకరు తినిపించుకోవడం, పెళ్ళిలో డాన్స్ లు వేయడం లాంటివి. మరి, పెళ్లి రోజున వధువు లెహంగా ధరించి పుషప్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? ఇదిగో చూసేయండి.
ఈ వీడియోలో కనిపిస్తున్న వధువు పేరు.. అనా అరోరా. లెహంగాలో చూడముచ్చటగా ఉంది కదా. ఈమెకు వ్యాయామం చేయడమంటే చాల ఇష్టమట. అందుకే.. పెళ్లిరోజు కూడా తన దినచర్యను మిస్ అవ్వకూడదని.. ఉన్నపలంగా పుషప్స్ మొదలెట్టేసింది. ఇందులో ఏముంది అంటారా?. జిమ్ దుస్తుల్లో పుషప్స్ చేయడం అందరూ చేసే పనే. అయితే తాను మాత్రం.. భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో పుషప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇది కూడా చదవండి: 70 సెం.మీ. తోక కలిగి ఉన్న యువకుడు..! వీడియో వైరల్!
ఎరుపు రంగు లెహంగా ధరించి, భారీ అభరణాలతో ఆమె పుషప్స్ తీస్తుండగా.. పక్కన ఉన్నవారు ఆమెను బాగానే ఎంకరేజ్ చేశారు. ఆమె జిమ్ సెషన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన వీడియోలు ఒక లెక్క.. ఈ పుషప్స్ వీడియో ఓ లెక్క. పెళ్లి లెహంగాలో సైతం ఆమె నార్మల్ దుస్తుల్లో ఉన్నత కూల్ గా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పుషప్స్ తీసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
#NDTVBeeps | Bride Does Push-Ups Wearing Lehenga, Jewellery pic.twitter.com/UCMNquJFFG
— NDTV (@ndtv) April 14, 2022
పెళ్లి రోజున భారీ లెహంగాలో వాష్ రూంకు వెళ్లేందుకే ఇబ్బంది పడతారని..ఈమె మాత్రం సింపుల్ గా పుషప్స్ తీయడం ఆశ్చర్యపరిచిందని కామెంట్ చేశారు. వధువు ఫిట్నెస్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు అనిపిస్తోందని మరో యూజర్ కామెంట్ చేశారు. ఏదైతేనేం.. వధువు తన పెళ్లి రోజున కూడా తన ఫిట్నెస్ దినచర్యను మిస్ అవ్వలేదు. ఈ పెళ్లికూతురుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Please shoot me or give me poison. 😬😬😬 pic.twitter.com/mhIQ7Gc2mV
— Mr.Mysterious (@mysterious_tri) April 14, 2022
ఇది కూడా చదవండి: వైరల్: విదేశీ యువతితో ఫొటోలకు ఎగబడ్డ యువకులు.. మీద చెయ్యి వేసి మరీ..