ప్రతీ మనిషి జీవితంలో తల్లి మొదటి రియల్ హీరో. బిడ్డను తొమ్మిది నెలలు తన కడుపులో మోసి జన్మనివ్వటమే కాదు. జీవితాంతం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బిడ్డలకు ప్రమాదం అని తెలిస్తే.. తన ప్రాణాలను అడ్డుగా వేస్తుంది. తాను చనిపోయినా తన బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఓ పక్షి తన గుడ్లను కాపాడుకోవటానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. తనకు ఏమైనా పర్వాలేదు.. పుట్టబోయే బిడ్డలు బాగుంటే చాలు అనుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పక్షి పొలంలో నేలపై కొన్ని గుడ్లను పెట్టి ఉంది. వాటికి ఏమీ కాకుండా చూసుకోసాగింది. ఈ నేపథ్యంలోనే గుడ్లు ఉన్న ప్రదేశంలోకి ఓ ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ నేరుగా పక్షి దగ్గరకు రాసాగింది. ఇది గమనించిన పక్షి అప్రమత్తం అయింది. ట్రాక్టర్ నుంచి తన గుడ్లను కాపాడుకోవటానికి వాటి మీదకు వచ్చింది. తన రెండు రెక్కల్ని వాటికి రక్షణ వలయంగా చుట్టింది.
ట్రాక్టర్ దగ్గరకు వస్తున్నా చలించలేదు. తన మీద నుంచి పోతున్నా కూడా పక్కకు జరగలేదు. ట్రాక్టర్ పక్షి మీదనుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటన 2019లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ తల్లి ప్రేమను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The bird does not move so she can protect her eggs on the ground pic.twitter.com/e5ZYWmWoaX
— Vala Afshar (@ValaAfshar) December 30, 2022