ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో ప్రత్యక్ష మవుతుంది. అలా నెటింట్లో కనిపించి వీడియోల్లో, వార్తల్లో కొన్ని మనకు మాములుగానే కనిపించిన మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరు యువత చేసే విన్యాసాలు అందరిని అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా ఓ యువకుడు చేసిన సాహసం అందరిని షాక్ కి గురి చేసింది.
నేటికాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో ప్రత్యక్ష మవుతుంది. అలా నెటింట్లో కనిపించి వీడియోల్లో, వార్తల్లో కొన్ని మనకు మాములుగానే కనిపించిన మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరు యువత చేసే విన్యాసాలు అందరిని అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా ఓ యువకుడు చేసిన సాహసం అందరిని షాక్ కి గురి చేసింది. నదిలో బైక్ ను నడుపుతూ..ఒక ప్రాంతం నుంచి ఇంకొచోటికి రయ్ రయ్ అని వెళ్లాడు. అతడు రోడ్డుపై వెళ్తున్నాడ లేక నీటలో వెళ్తున్నాడా? అనేంత ఫ్రీగా బైక్ ను నదిలో నడిపాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది.
మన వద్ద అద్భుతమైన ప్రతిభను చూపెట్టె వాళ్లకు కొదవే లేదు. ముఖ్యంగా యువత చిత్రవిచిత్ర వేషాలు, వీడియోలు చేస్తుంటారు. అలానే అమ్మనాన్నలు బైక్ లు కొనిపెట్టి, చక్కగా జాబ్ చేసుకోమంటే .. జర్క్‌లు ఇచ్చుకుంటూ అమ్మాయిలు ముందు విన్యాసాలు చేసే వీరులు మనకు తారసపడుతూనే ఉంటారు. రోడ్లపై బైక్ ముందు చక్రం గాల్లోకి లేపి.. రేసింగ్స్ చేసే అతిగాళ్ల మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. అలానే సర్కస్ చేసేవాళ్లు బతుకు దెరువు కోసం బైక్ లను గాల్లోకి లేపడం కూడా చూసే ఉంటారు. కానీ ఇప్పటివరకు ఓ యువకుడు ఎవరు చేయని స్టంట్‌ను చేశాడు. తన ఇంటికి దగ్గర దారిలో వెళ్లాలనుకున్నాడు ఓ యువకుడు.
అయితే నదిలో కాస్తా దూరంలో వెళ్తే.. అక్కడి నుంచి దగ్గర మార్గం కనిపించింది. అయితే కాస్తా నీటిలో వెళ్లడానికి పెద్ద సాహసమే చేయలి. ఆ యువకుడు అదే సాహసం చేశాడు. ఆ యువకుడు నదిలోని నీళ్లను లెక్క చెయ్యకుండా బైక్ ను నడిపాడు. ఆయింత మధ్యలో నీళ్లు ఎక్కువ ఉన్నట్లుయితే పెద్ద ప్రమాదమే జరిగేది. అంతేకాదు ఇంజన్‌లోకి, సైలెన్సర్‌లోకి నీళ్లు పోయి బైక్ నది మధ్యలో ఆగిపోతే.. వెనక్కు రాలేక.. ముందుకు పోలేక చుక్కలు కనపడేవి. మరి ఈ వాటర్ రైడర్ వీడియో ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి జాతి రత్నాలంటే మనకాడే ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.